మీరే పెట్టుబడి పెట్టండి, మీరే కొనుక్కోండి -జగనన్న మార్క్ మార్ట్లు DWCRA Women Cheyutha Marts: ఎవరు ఔనన్నా కాదన్నా మహిళా మార్టుల్లో జరుగుతోంది ఇదే! జగన్ తన ఘనతగా డప్పేసుకునే మహిళా మార్టుల్లో నిజానికి ఆయన ఉద్ధరించిందేమీలేదు! ఒక్కో మహిళా మార్ట్ ఏర్పాటుకు అయ్యే ఖర్చు 40 నుంచి 60 లక్షల రూపాయయలు! కానీ వీటికి ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా విడుదల చేయదు. పెట్టుబడంతా డ్వాక్రా మహిళలదే. ఏమండలంలో మార్ట్ పెట్టాలనుకుంటారో ఆ పరిధిలోని అన్ని డ్వాక్రా సంఘాల పొదుపు మహిళల వద్ద 150 నుంచి 250 రూపాయల చొప్పున వాటా ధనంగా వసూలు చేస్తారు. పెట్టుబడి పెట్టిన మహిళల్ని వాటాదారులుగా పేర్కొంటున్నారు.
గత సెప్టెంబర్ వరకూ వీటిని 44 చోట్ల ఏర్పాటు చేశారు. వంద వరకూ ఏర్పాటు చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఒక్కో మార్ట్ ఏర్పాటుకు 60 లక్షల చొప్పున లెక్కేసినా, వంద మార్టులకు 60 కోట్ల వరకూ ఖర్చవుతుంది. ఆ మాత్రం నిధుల్నీ ప్రభుత్వం ఖర్చు పెట్టకుండా మహిళల సొమ్ము తీసుకుంటోంది? ఇందులో జగన్ ప్రచార బాకా తప్ప, మహిళా సాధికారత ఎక్కడుంది? అందుకే ఇటీవల అనకాపల్లి జిల్లా చోడవరం మహిళా మార్ట్ వద్ద ఐద్వా ప్రతినిధులు నిరసనకు దిగారు.
Zero Interest Loans For DWACRA Women: డ్వాక్రా మహిళల సున్నావడ్డీకి 'సున్నం'కొట్టిన సీఎం.. చెప్పేదేంటి చేసేదేంటి జగనన్నా..!
మహిళా మార్టుల్లో పెట్టుబడిదారులే కొనుగోలుదారులు! అందులోని సరుకులు డ్వాక్రాలు కొనాల్సిందే. ఆ బాధ్యతను గ్రామ సమాఖ్య సహాయకులు- వీవోఏ లపై పెట్టారు. ఉద్యోగాలు ఉండాలంటే అమ్మకాలు చేయించాల్సిందేనని వీవోఏలకు టార్గెట్లు పెడుతున్నారు. డ్వాక్రాలు కొనుగోళ్లకు ముందుకు రాకపోతే ‘బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించం, సున్నా వడ్డీ, చేయూత, ఆసరా పథకాలు ఆపేస్తాం అనే రీతిలో బెదిరిస్తారు. కాకపోతే ఇదంతా కూడా మౌఖికంగానే జరుగుతుంది.
మాడుగుల మార్ట్‌లో మొదట్లో నెలకు ఒక్కో వీవోఏకు 50 వేల రూపాయల మేర అమ్మకాలు చేపట్టాలని టార్గెట్ ఇచ్చారు. ఇప్పుడు ఒక్కో డ్వాక్రా సంఘంలోని ప్రతీ సభ్యురాలితో కనీసం 200 రూపాయల చొప్పున కొనుగోలు చేయించాలనే హుకుం జారీ చేశారు. డబ్బులు లేవంటూ ఎవరైనా మహిళలు ముందుకు రాకపోతే బ్యాంకులో దాచుకున్న పొదుపు మొత్తం నుంచి రుణం ఇప్పించి మరీ కొనుగోలు చేయిస్తున్నారు.
వైఎస్సార్ చేయూత - మహిళల ఉపాధి కల్పనపై జగన్ మాటల గారడీ
శ్రీకాకుళం జిల్లాలో డ్వాక్రా మహిళల పరిస్థితి మరింత దారుణం. జిల్లాలో శ్రీకాకుళం, నరసన్నపేటలోనే మార్టున్నాయి. మొత్తం 30 మండలాలను, ఈ రెండింటికే విభజించి సర్దుబాటు చేశారు. శ్రీకాకుళం, నరసన్నపేటకు దాదాపుగా వంద కిలోమీటర్ల దూరంలో ఉండే ఇచ్ఛాపురం, కవిటి, సోంపేట, కంచలి మండలాల నుంచి వచ్చి వీవోఏలు సరుకులు కొనాలి. తిరిగి అక్కడికి వెళ్లి డ్వాక్రా మహిళలకు అందించాలి. నెలకోసారి ఒక వీవోఏ 2 వేల రూపాయలమేర నిత్యావసరాలు కొనుగోలు చేయించాలనేది అక్కడి టార్గెట్.
పోనీ పెట్టుబడి పెట్టిన డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం లాభాలేమైనా పంచిందా? అంటే అదీ లేదు. 2022 ఆగస్టులో కాకినాడ జిల్లా ఉప్పాడలో రాష్ట్రంలోనే మొదటి మహిళా మార్ట్ ఏర్పాటైంది! ఇక్కడ సుమారు 2,400 డ్వాక్రా సంఘాల్లోని మహిళల నుంచి 40 లక్షల రూపాయల వరకూ సేకరించారు. అదనంగా మరో 20 లక్షల రూపాయలు సమాఖ్య నిధుల నుంచి తీసుకుని మార్ట్ ఏర్పాటుకు పెట్టుబడి పెట్టారు. ఏడాది కాలంలోరూ.20 లక్షలు ఆదాయం వచ్చినట్టు అధికారులు ప్రకటించారు. కానీ 17 నెలలవుతున్నా ప్రభుత్వం ఇప్పటివరకూ ఒక్క రూపాయి కూడా పంచలేదు. సమాఖ్య నుంచి తీసుకున్న 20 లక్షల రూపాయలకు వడ్డీ కూడా చెల్లించలేదు.
అక్కచెల్లెమ్మలపై జగన్ అలసత్వం - బాలింతలకు అందని 'ఆసరా'