ఆంధ్రప్రదేశ్

andhra pradesh

నకిలీ విత్తనాలు... కర్నూలు టూ గుంటూరు

భారీగా నకిలీ పత్తి విత్తనాలు బయటపడిన ఘటన గుంటూరులో చోటుచేసుకుంది. సుమారుగా 2 వేల ప్యాకెట్లును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

By

Published : Jun 19, 2019, 8:24 AM IST

Published : Jun 19, 2019, 8:24 AM IST

గుంటూరులో భారీగా నకిలీ విత్తనాలు పట్టివేత

గుంటూరుజిల్లా వ్యాప్తంగా వ్యవసాయ అధికారులు జరిపిన తనిఖీల్లో భారీగా నకిలీ పత్తి విత్తనాలు బయటపడ్డాయి. ముఖ్యంగా పల్నాడు ప్రాంతంలో పత్తి సాగు ఎక్కువగా జరుగుతుంది. రైతుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకున్న కొందరు వ్యాపారులు నకిలీ విత్తనాలు విక్రయిస్తున్నారు. వ్యవసాయ అధికారులు జరిపిన దాడుల్లో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. సత్తెనపల్లి, నర్సరావుపేట, క్రోసూరు ప్రాంతాల్లోని దుకాణాల్లో 2 వేలకుపైగా విత్తన ప్యాకెట్లు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కర్నూలు నుంచి ఈ విత్తనాలు తీసుకొచ్చి విక్రయిస్తున్నట్లు విచారణలో తేలింది. తనిఖీలు ఇంకా కొనసాగిస్తామని... నకిలీ విత్తనాలు మార్కెట్లో నియంత్రిస్తామని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు.

గుంటూరులో భారీగా నకిలీ పత్తి విత్తనాలు పట్టివేత

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details