గుండెపోటు కాదు.. బలవన్మరణమే! - tdp
మాజీ సభాపతి కోడెల శివప్రసాదరావు బలవన్మరణానికి పాల్పడ్డట్టు వైద్యులు నిర్థరించారు. ఆయన గుండెపోటుతో మరణించారని తొలుత వార్తలు వచ్చాయి.
kodela shivaprasadarao
తెలుగుదేశం పార్టీ అగ్రనేత కోడెల శివప్రసాదరావు కన్నుమూత.. బలవన్మరణమే అని నిర్థరణ అయ్యింది. తొలుత.. ఆయన తీవ్ర గుండెపోటుతో చనిపోయారని వార్తలు వచ్చినా.. వైద్యులు పరీక్షించిన అనంతరం కోడెల బలవంతంగా ప్రాణం విడిచారన్న వార్త.. నిర్థరణకు వచ్చింది. హైదరాబాద్ లోని తన స్వగృహంలో ఆత్మహత్యకు పాల్పడ్డట్టుగా తెలుస్తోంది. కొన్నాళ్లుగా తీవ్ర మనస్తాపంతో ఉన్న కారణంగానే.. కోడెల ఇంతటి నిర్ణయానికి తెగించి ఉండవచ్చన్న అభిప్రాయం అనుచరుల్లో వ్యక్తమవుతోంది.
Last Updated : Sep 16, 2019, 2:32 PM IST