గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం తిక్కిరెడ్డిపాలెంలోని ... శ్రీ కోదండ రామాలయం అంటే తెదేపా నేతలకు అమితమైన సెంటిమెంట్. పార్టీ ఆవిర్భావం నుంచి నియోజకవర్గానికి చెందిన ప్రతీ అభ్యర్థి... రాములవారి ఆశీస్సులు తీసుకుని విజయం సాధించిన వాళ్లే. ఇదే అనవాయితీని ప్రస్తుత తెదేపా అభ్యర్థి డొక్కా మాణిక్య వరప్రసాద్.. కొనసాగించారు. ప్రత్తిపాడు తెదేపా అభ్యర్థిగా నామపత్రాలు దాఖలు చేసిన అనంతరం.. కోదండ రామాలయంలో స్వామివారిని దర్శించుకున్నారు. గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు.
ఆ రామాలయం... తెదేపా నేతలకు వరం - tdp
తెదేపా అభ్యర్థులకు ఆ కోదండ రామాలయం కలిసొచ్చింది. నియోజకవర్గం నుంచి పార్టీ తరఫున ఎవరు బరిలో ఉన్నా... తప్పనిసరిగా ఆ ఆలయాన్ని దర్శించుకోనిదే ఎన్నికల ప్రచారం ప్రారంభించరు.
కోదండ రామాలయంలో డొక్కా మాణిక్య వరప్రసాద్
ఇవి కూడా చదవండి...