ఒంగోలులో వైద్యులు .24 గంటలపాటు వైద్య సేవలను పూర్తిగా నిలిపేస్తున్నట్లు ప్రకటిస్తూ, నిరసన కార్యక్రమాలు చేపట్టారు. రిమ్స్ ఆసుపత్రిలో వైద్యులు, జూనియర్లు డాక్టర్లు ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా రోడ్డెక్కారు. వైద్యులు రిమ్స్ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రయివేట్ వైద్యులు కూడా ఆసుపత్రుల్లో సేవలను నిలిపివేసారు... అత్యవసర సేవలను సైతం నిలిపివేస్తున్నట్లు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రతినిధులు పేర్కొన్నారు.. అల్లోపతి వైద్య రంగాన్ని నిర్వీర్యం చేసే విధంగా ఉన్న ఈ బిల్లును తక్షణం రద్దు చేయాలని వీరు డిమాండ్ చేసారు. తమకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు.అనంతరం చర్చి కూడలి వద్ద మానవహారం నిర్వహించి తమ ఆందోళన వ్యక్తం చేశారు.