ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దీపావళి పండగకు మిచిగాన్ సెనెట్ హౌస్ అధికారిక గుర్తింపు

దీపావళి పండుగను భారతదేశం మొత్తం జరుపుకునే అతి పెద్ద పండుగలలో ఒకటి. అలాంటి పండుగను ప్రవాస భారతీయులు పక్క దేశాల్లో జరుపుకోవడానికి చట్ట సభల్లో తీర్మానాలు పెట్టి ఆమోదించుకుంటున్నారు.

By

Published : Nov 4, 2021, 9:34 AM IST

దీపావళి పండగకు మిచిగాన్ సెనెట్ హౌస్ అధికారిక గుర్తింపు
దీపావళి పండగకు మిచిగాన్ సెనెట్ హౌస్ అధికారిక గుర్తింపు

అమెరికాలోని మిచిగాన్ రాష్ట్ర సెనెట్ హౌస్.. దీపావళి పండుగకు అధికారిక గుర్తింపు ఇచ్చిందని గుంటూరు జిల్లా తెనాలికి చెందిన ప్రవాస భారతీయురాలు జహనాబేగం తెలిపారు. సెనెటర్ జిమ్ రన్ స్టడ్ తీర్మాన్నాన్ని ప్రతిపాదించగా.. మరో సెనెటర్ డేటా పోల్ హంకి మద్దతు తెలిపారు. మంగళవారం సాయంత్రం సెనెట్ హౌస్ ఆ తీర్మాన్నాన్ని ఆమోదించిందని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా తనతో పాటు మరికొందరు ప్రవాస భారతీయులను స్టేట్ క్యాపిటల్ భవన్ కు ఆహ్వానించారని పేర్కొన్నారు. పండుగలు కుల మతాలకు అతీతమని.. అందరూ కలసిమెలసి ఉండాలన్న సందేశాన్నితెలియజేశారు.

ABOUT THE AUTHOR

...view details