లాక్డౌన్లోనూ జాతీయ రహదారిపై అత్యవసర సేవలకు సంబంధించిన వాహనాలను అనుమతిస్తున్నారు. కానీ సుదూర ప్రాంతాల నుంచి రాకపోకలు చేసే లారీ డ్రైవర్లకు కనీస ఆహారం దొరకడం లేదు. ఈ విషయాన్ని గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన సాయి రెసిడెన్సీ సముదాయ నిర్వాహకులు గుర్తించారు. అన్ని జాగ్రత్తలు పాటిస్తూ రోజూ 400 మందికి ఆహారపు పొట్లాలను.. డ్రైవర్లకు, క్లీనర్లకు అందిస్తున్నారు. వారి ఆకలి తీరుస్తున్నారు.
హైవేపై ఆకలి తీరుస్తున్న దాతలు - lockdown news in chilakalutipeta
కరోనా లాక్డౌన్లో హైవేలపై అత్యవసర సేవలు నిర్వహించే లారీ డ్రైవర్ల పరిస్థితి దయనీయంగా మారింది. ఈ విషయాన్ని గమనించిన చిలకలూరుపేట వాసులు.. వారి ఆకలిని తీరుస్తున్నారు. ఆహార పొట్లాను పంపిణీ చేస్తున్నారు.
Distribution of food parcels to lorry drivers and cleaners at chilakalutipeta in guntur