Delhi Liquor Scam updates: దిల్లీ మధ్యం కుంభకోణం కేసులో ముగ్గురు నిందితులకు చెందిన రూ. 76.54 కోట్ల విలువైన ఆస్తులను.. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అటాచ్ చేసింది. సమీర్ మహేంద్రు, గీతిక మహేంద్రులకు చెందిన దిల్లీలోని రూ. 35 కోట్ల విలువైన నివాస స్థలాలు అటాచ్ చేసినట్లు తెలిపింది. గురుగ్రామ్‌లో అమిత్ అరోరాకు చెందిన రూ.7.68 కోట్ల విలువైన ఆస్తులు.. ముంబయిలో విజయ్ నాయర్‌కు చెందిన రూ.1.77 కోట్ల విలువైన ప్లాట్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జప్తు చేసింది. దినేశ్ అరోరాకు చెందిన రూ.3.18 కోట్ల విలువైన రెస్టారెంట్ సహా.. హైదరాబాద్‌లో అరుణ్ పిళ్లైకు చెందిన రూ.2.25 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ స్వాధీనం చేసుకుంది. మరోవైపు మద్యం స్కామ్‌లో దిల్లీ ఖజానాకు రూ.2873 కోట్లు నష్టం జరిగినట్లు ఈడీ వెల్లడించింది.
నిందితులకు సీబీఐ ప్రత్యేక కోర్టు బెయిల్: అంతకుముందు ఈ నెల మొదటివారంలో దిల్లీ మద్యం కుంభకోణం కేసులో నిందితులకు సీబీఐ ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేసింది. సీబీఐ దాఖలు చేసిన ఛార్డిషీట్‌పై రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరిగింది. ఒక్కొక్కరికి రూ.50,000 వ్యక్తిగత పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసిన కోర్టు.. నిందితుల రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై సీబీఐకి నోటీసు జారీ చేసింది. బెయిల్ పొందిన వారిలో ఎక్సైజ్ శాఖ మాజీ అధికారులు కుల్దీప్ సింగ్, నరేందర్ సింగ్, ముత్తా గౌతమ్, అరుణ్ పిళ్లై, వ్యాపారవేత్త సమీర్ మహేంద్రులు ఉన్నారు.