గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ఓ వృద్థురాలు మరణించగా అంత్యక్రియలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. చిలకలూరిపేట వద్ద పసుమర్రు గ్రామానికి చెందిన మేడికొండూరు ఆదిశేషమ్మ (70) భర్త చనిపోవటంతో సత్తెనపల్లిలోని కూతురు, అల్లుడు వద్ద ఉంటున్నారు. ఆదివారం రాత్రి అనారోగ్యంతో మృతి చెందిన ఆదిశేషమ్మకు కరోనా ఉందనే అపోహతో అంత్యక్రియలు నిర్వహించేందుకు ఎవరూ ముందుకు రాలేదు. అయితే స్థానికంగా ఉన్న ఓ న్యాయవాది... ఈ విషయాన్ని ప్రజ్వలన బృందం దృష్టికి తీసుకెళ్లారు. వారు వెంటనే స్పందించి వృద్ధురాలి మృతదేహాన్ని శ్మశానానికి తరలించి అంత్యక్రియలు నిర్వహించారు.
వృద్ధురాలి అంత్యక్రియలు చేసిన ప్రజ్వలన బృందం
కరోనా కాలంలో చనిపోతే పెద్ద సమస్యే...కడసారి చూడ్డానికి కాదు కాదా..కనీసం అంత్యక్రియలు చేయటానికి కూడా వెనకడుగు వేస్తున్నారు కొందరు. తాజాగా గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ఓ వృద్ధురాలు అనారోగ్యంతో చనిపోతే ఆమెకు ఖననం చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు.
dead body cremation process done by guntur dst sathenapalli