వరదతో గుంటూరు జిల్లా కృష్ణా పరీవాహక లంక ప్రాంతాల్లో పంటలు పూర్తిగా నీటమునిగాయి. వరద తగ్గుముఖం పట్టినా ఇంకా నీటిలోనే పంటలు ఉన్నాయి. అరటి, పసుపు, కంద, కూరగాయ పంటలు పూర్తిగా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కొక్క పంటకు ఎకరానికి లక్ష రూపాయలు దాకా పెట్టుబడి పెట్టామనీ.. ఇప్పుడీ వరద వల్ల పాడైన పంటతో ఒక్క రూపాయి కూడా వచ్చే పరిస్థితి లేదని వాపోతున్నారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలనీ.. వెంటనే పరిహారం చెల్లించాలని కోరారు.
పంట నీటమునక.. అన్నదాతల కళ్లల్లో కన్నీళ్లు - నీటిలో
నెలన్నర క్రితమే పొలాల్లో పంట వేశారు. ఇప్పుడిప్పుడే చక్కగా ఎదుగుతున్న మొక్కలకు సమయానికి ఎరువులు, నీరు అందిస్తూ పెంచుకుంటున్నారు. అంతలోనే ఊహించని వరద ముంచుకొచ్చింది. పంటలను ముంచేసింది. కృష్ణా పరీవాహక లంక ప్రాంతాల్లో.. నీళ్లలో నానుతున్న పంటలను చూస్తూ అన్నదాతలు కన్నీరు పెడుతున్నారు.
వరద నీటిలో పంటలు.. అన్నదాతల కళ్లల్లో కన్నీళ్లు