ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'పోలీస్​స్టేషన్​పై దాడి ఘటనపై ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించాలి'

పాత గుంటూరు పోలీస్​స్టేషన్​పై జరిగిన దాడి ఘటనపై గత ప్రభుత్వం మైనారిటీలపై అక్రమంగా కేసులు పెట్టిందని.. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు. ఈ కేసులు రద్దు చేసేందుకు వైకాపా ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించాలని ఆయన కోరారు. పది రోజుల్లో ఈ విషయంపై స్పష్టం ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలోఆ పోలీస్​స్టేషన్​ వద్ద ఆందోళన చేస్తామన్నారు.

Cpm madhu
Cpm madhu

By

Published : Nov 13, 2020, 3:06 PM IST

పాత గుంటూరు పోలీసుస్టేషన్​పై జరిగిన దాడిలో మైనారిటీలపై అక్రమంగా పెట్టిన కేసులపై ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు పేర్కొన్నారు. గుంటూరులో మాట్లాడిన ఆయన.. గత ప్రభుత్వం పాత గుంటూరు పోలీసుస్టేషన్​ ఘటనలో మైనారిటీ, వైకాపాకి చెందిన వారున్నారని కేసులు పెట్టిందన్నారు. దీనిపై ముస్లిం కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్తే సీపీఎం నాయకులను అడ్డుకున్నారని, వైకాపా అధికారంలోకి వచ్చాక అక్రమంగా పెట్టిన కేసులు రద్దు చేసిందనారు.

అయితే కొందరు కావాలని కోర్టుకెళ్లటం దుర్మార్గమని సీపీఎం మధు అన్నారు. హైకోర్టు ఎన్ఐఏకు అప్పగించడం బాధాకరమన్నారు. ప్రభుత్వం స్పందించి.. సుప్రీంకోర్టుకు వెళ్లి మైనారిటీలపై పెట్టిన కేసులను రద్దు చేయించాలన్నారు. పది రోజుల్లో ఈ విషయంపై స్పష్టత ఇవ్వాలని, లేకుంటే కేసులు రద్దు చేసే వరకు పాత గుంటూరు పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేస్తామన్నారు.

ABOUT THE AUTHOR

...view details