ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'తెలుగు, ఆంగ్ల మాధ్యమాన్ని సమానంగా బోధించాలి'

వైకాపా ప్రభుత్వం తీసుకున్న ఆంగ్ల మాధ్యమ అమలు నిర్ణయంపై సీపీఎం పోలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం మెుండి వైఖరి కనబరుస్తోందని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు, ఆంగ్ల మాధ్యమాలను సమానంగా బోధించాలని డిమాండ్​ చేశారు.

By

Published : Dec 14, 2019, 11:16 PM IST

'తెలుగు-ఆంగ్ల మాధ్యమాన్ని సమానంగా బోధించాలి'
'తెలుగు-ఆంగ్ల మాధ్యమాన్ని సమానంగా బోధించాలి'

'తెలుగు-ఆంగ్ల మాధ్యమాన్ని సమానంగా బోధించాలి'

ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మధ్యమాన్ని అమలు చేసి తీరతామన్న వైకాపా మొండి వైఖరిని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు తప్పుబట్టారు. గుంటూరు శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో నిర్వహించిన భారత కమ్యూనిస్టు పార్టీ శతవార్షికోత్సవం కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దేశ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో భారత కమ్యూనిస్టు శత వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు, ఆంగ్ల మాధ్యమాన్ని సమానంగా బోధించాలని ఆయన డిమాండ్ చేశారు. లేదంటే రాష్ట్రం మరో 20 ఏళ్లు వెనుకకు వెళ్తుందని అభిప్రాయపడ్డారు.

ABOUT THE AUTHOR

...view details