సీఎం జగన్ తన ఆలోచనను మార్చుకుని రాజధానిగా అమరావతినే కొనసాగించాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. గుంటూరు సీపీఐ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల ముందు రాజధాని గురించి మాట్లాడకుండా.. అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలను మభ్యపెట్టడానికి మూడు రాజధానులు ప్రతిపాదనను తెరపైకి తీసుకువచ్చారని ఆరోపించారు.
విశాఖ స్టీల్, కృష్ణపట్నం పోర్టులు ప్రైవేటుపరం కాకుండా ముఖ్యమంత్రి స్వయంగా జోక్యం చేసుకుని అఖిలపక్షం ఏర్పాటు చేసి.. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలన్నారు. తన మేనిఫెస్టో తనకు శ్రీరామ రక్ష అనుకుంటూ కాలం గడపాలనుకోవడం సమంజసం కాదన్నారు. సీఎం జగన్ నవరత్నాల పేరుతో కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు.