ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

టిడ్కో ఇళ్లను డిసెంబర్ 5లోపు పంపిణీ చేయాలి.. లేకపోతే: రామకృష్ణ - రామకృష్ణ

CPI RAMAKRISHNA VISIT TIDCO HOUSES : ఇళ్ల నిర్మాణం పూర్తయి మూడేళ్లు గడుస్తున్న ఇంతవరకు లబ్ధిదారులకు ఎందుకు పంపిణీ చేయలేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రశ్నించారు. టిడ్కో ఇళ్ల లబ్ధిదారులకు డిసెంబర్ 5 లోపు పంపిణీ చేయాలని డిమాండ్​ చేశారు.

CPI RAMAKRISHNA VISIT TIDCO HOUSES
CPI RAMAKRISHNA VISIT TIDCO HOUSES

By

Published : Nov 19, 2022, 8:08 PM IST

టిడ్కో ఇళ్లను డిసెంబర్ 5 లోపు పంపిణీ చేయాలి

CPI RAMKRISHNA ON TIDCO HOUSES : టిడ్కో ఇళ్ల లబ్ధిదారులకు డిసెంబర్ 5లోపు గృహాలు ఇవ్వకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ హెచ్చరించారు. గుంటూరు జిల్లా తుళ్లూరులో టిడ్కో ఇళ్లను పార్టీ నేతలతో కలిసి పరిశీలించారు. ఇళ్ల నిర్మాణం పూర్తయి మూడేళ్లు గడుస్తున్న ఇంతవరకు లబ్ధిదారులకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా పేదల కోసం ఇస్తున్న సెంట్​స్థలాన్ని రెండు సెంట్లకు పెంచాలని.. ఇంటి నిర్మాణం కోసం ఇచ్చే లక్ష రూపాయలను రూ.ఐదు లక్షల వరకు పెంచాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details