కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాల వ్యవహార శైలి వివాదాస్పదంగా మారిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అభిప్రాయపడ్డారు. గుంటూరులో సీపీఐ ఎంఎల్ రాష్ట్రస్థాయి సదస్సుకు హాజరైన ఆయన..ఈసీ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘం పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందని రామకృష్ణ ఆరోపించారు. స్వతంత్ర సంస్థ అయిన ఈసీఐ... భాజపా అనుకూల నిర్ణయాలు తీసుకోసుకుంటోందని ఆరోపించారు. ఇటువంటి చర్యలు ప్రజాస్వామ్య వ్యవస్థకు మంచిది కాదని హితవుపలికారు. ప్రజల్లో నమ్మకం కల్గించేలా ఈసీ నిర్ణయాలు ఉండాలని రామకృష్ణ కోరారు.
'ఎన్నికల సంఘానిది పక్షపాత ధోరణి' - రామకృష్ణ
ఎన్నికల సంఘం నిర్ణయాలు ఒక పార్టీకి అనుకూలంగా ఉంటున్నాయని... అవి ప్రజాస్వామ్య వ్యవస్థకు విఘాతం కల్గించేలా ఉన్నాయని సీపీఐ నేత రామకృష్ణ అన్నారు. ఈసీఐ స్వతంత్ర ప్రతిపత్తిని కోల్పోయే స్థితికి చేరిందని విమర్శించారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ