ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆ మూడు గ్రామాలపై ఆంక్షలు..ఎందుకో తెలుసా? - Covid sanctions on three villages in Tenali Mandal

కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న తరుణంలో గుంటూరు జిల్లాలోని ఓ మూడు గ్రామాలపై అధికారులు ఆంక్షలు విధించారు. గ్రామ పెద్దల కోరిక మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు వెల్లడించారు.

Covid sanctions on three villages in Tenali Mandal
ఆ మూడు గ్రామాలపై ఆంక్షలు...ఎందుకో తెలుసా?

By

Published : Apr 11, 2021, 10:11 PM IST


కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తున్న నేపథ్యంలో గుంటూరు జిల్లా తెనాలి మండలంలోని పెదరావూరు, అంగలకుదురు, కఠెవరం గ్రామాలపై కరోనా ఆంక్షలు విధిస్తున్నట్లు మండల టాస్క్​ఫోర్స్ అధికారుల సమావేశంలో నిర్ణయించినట్లు తహసీల్దార్ కె. రవిబాబు పేర్కొన్నారు. టాస్క్​ఫోర్స్ సమావేశంలో ఎంపీడీవో విజయాలక్ష్మణ్, రూరల్ ఎస్ఐ మురళి, మెడికల్ అధికారి శ్రీవల్లి పాల్గొన్నారు. ఆ మూడు గ్రామాల పెద్దలు కోరడంతో..ఈ నిర్ణయం తీసుకున్నట్లు టాస్క్​ఫోర్స్ అధికారి రవిబాబు తెలిపారు.

సోమవారం నుండి ఈ నెల 27వ తేదీ వరకు ఆంక్షలు కొనసాగుతాయన్నారు. ఉదయం 6 గంటల నుండి 11 గంటలకు వరకే వాణిజ్య సదుపాయాలకు అవకాశం కల్పించినట్లు తెలిపారు. అత్యవసర విభాగాలైన మెడిసిన్, పాల విక్రయాలను ఆంక్షల నుంచి సడలించామన్నారు. ప్రతి ఒక్కరూ మాస్ ధరించాలన్నారు. అత్యవసరమైతే బయటికి రావాలే తప్ప అనవసరంగా మాస్కులు లేకుండా బయటకు తిరిగితే జరిమానా విధిస్తామని హెచ్చరించారు. కొవిడ్​పై మైక్ అనౌన్స్​మెంట్ల్ ద్వారా అవగాహన కల్పిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

ఇదీ చదవండి:
ఆంజనేయులు క్షేమం.. సీఎం ఇంటి వద్ద గుర్తింపు

ABOUT THE AUTHOR

...view details