ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తెనాలిలో కొవిడ్ హెల్ప్ సెంటర్లు ప్రారంభం - తెనాలిలో విజృంభిస్తున్న కరోనా

తెనాలిలో కరోనా మహమ్మారి రోజురోజుకీ విజృంభిస్తోంది. మరణాలు కూడా ఎక్కువ శాతంలో నమోదవుతున్నాయి. ఈ క్రమంలో ప్రజల్లో అవగాహన, వైద్యసేవలు అందించడానికి వైద్య సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉండేవిధంగా కొవిడ్ హెల్ప్ సెంటర్లను శాసనసభ సభ్యులు అన్నాబత్తుని శివకుమార్ ప్రారంభించారు. మున్సిపల్ కమిషనర్ యశ్వంతరావు, తహశీల్దార్ కె. రవిబాబు కార్యక్రమంలో పాల్గొన్నారు.

తెనాలిలో కోవిడ్ హెల్ప్ సెంటర్లను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే
తెనాలిలో కోవిడ్ హెల్ప్ సెంటర్లను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే

By

Published : Apr 21, 2021, 7:44 PM IST

గుంటూరు జిల్లా తెనాలిలో కొవిడ్ మహమ్మారిని నియంత్రించడానికి కొవిడ్ హెల్ప్ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు తెనాలి శాసనసభ సభ్యులు అన్నాబత్తుని శివకుమార్ పేర్కొన్నారు. బుధవారం ఆయన నాలుగు కొవిడ్ హెల్ప్ సెంటర్లను ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. ఈ హెల్త్ సెంటర్లలో 24 గంటలు దశలవారీగా ఏఎన్ఎం, గ్రామ వాలంటీర్, సచివాలయ, పోలీస్ సిబ్బంది అందుబాటులో ఉంటూ ప్రజలకు కావాల్సిన వైద్య సదుపాయాలకు పని చేస్తారన్నారు.

పట్టణంలో రోజురోజుకు పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో వాటిని అధిగమించడానికే ఈ చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ప్రధానంగా ఆయా వార్డులో ప్రతి గంటకూ పోలీస్ పెట్రోలింగ్ ఉంటుందన్నారు. జనం గుమిగూడిన, గుంపులుగా సంచరించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎమ్మెల్యే, సబ్ కలెక్టర్, మున్సిపల్ కమిషనర్, తహసీల్దార్, ప్రజాప్రతినిధుల పర్యవేక్షణలో ఈ కొవిడ్ హెల్ప్​లైన్ సెంటర్లు నిరంతరం పని చేస్తాయని వెల్లడించారు. ప్రజలు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని ఆకాంక్షించారు.

ఇదీ చదవండి:

'అమరావతి రైతుల కోసం వైఎస్ షర్మిల పోరాడాలి'

కరోనా వైరస్​పై 'కొవాగ్జిన్​' 78 శాతం ప్రభావవంతం

ABOUT THE AUTHOR

...view details