ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గుంటూరు జిల్లాలో విజృంభిస్తోన్న కరోనా.. 501 కేసులు నమోదు

గుంటూరు జిల్లాలో రోజురోజుకూ కరోనా తీవ్రత పెరుగుతోంది. ఇవాళ ఒక్కరోజే జిల్లావ్యాప్తంగా కొత్తగా 501 కేసులు నమోదయ్యాయి. మహమ్మారి బారిన ఒకరు మృతి చెందారు.

guntur corona cases
గుంటూరు జిల్లాలో విజృంభిస్తోన్న కరోనా

By

Published : Apr 11, 2021, 9:14 PM IST

గుంటూరు జిల్లాలో కొవిడ్ కేసుల ఉద్ధృతి మరింత పెరుగుతోంది. జిల్లాలో కొత్తగా 501 కేసులు నమోదయ్యాయి. గుంటూరు నగర పరిధిలో అత్యధికంగా 177 కేసులు బయటపడ్డాయి. నరసరావుపేటలో 46, తెనాలిలో 40, మంగళగిరి 32, తాడేపల్లిలో 20, వేమూరు, రేపల్లెలో 12 కేసుల చొప్పున గుర్తించారు. పొన్నూరులో 10, సత్తెనపల్లిలో 9 కేసులు, బాపట్లలో 8, చిలకలూరిపేట, నాదెండ్లలో 7 కేసులు, పెదకాకాని, చేబ్రోలులో ఆరు కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి జిల్లాలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 82,043కి పెరిగింది.

ఇవాళ కొవిడ్​తో ఒకరు చనిపోగా.. మహమ్మారి బారినపడి మృత్యువాత పడినవారి సంఖ్య 686కి చేరింది. జిల్లాలో ప్రస్తుతం 2,821 క్రియాశీల కేసులు ఉన్నాయి.

ఇదీ చదవండి:నిండుకున్న కొవిడ్ వ్యాక్సిన్​ నిల్వలు.. 'టీకా ఉత్సవ్'కు అవాంతరం

ABOUT THE AUTHOR

...view details