ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గుంటూరు బస్టాండ్​లో నాసిరకం పత్తివిత్తనాలు పట్టివేత - busstand

నాసిరకం పత్తివిత్తనాలు గుంటూరు బస్టాండ్ లో పట్టుబడ్డాయి. ఇద్దరు వ్యక్తులు పరారయ్యారు.

నకిలీ పత్తివిత్తనాలు

By

Published : Jun 8, 2019, 6:58 AM IST

గుంటూరు బస్టాండ్​లో నాసిరకం పత్తివిత్తనాలు పట్టివేత

గుంటూరు బస్టాండులో నాసిరకం పత్తివిత్తనాలు పట్టుబడటం కలకలం రేపింది. ఇద్దరు వ్యక్తులు నాసిరకం పత్తివిత్తనాలు తరలిస్తున్నారని వచ్చిన సమాచారం మేరకు వ్యవసాయశాఖ అధికారులు బస్టాండులో తనిఖీలు నిర్వహించారు. 30వ నంబర్ ప్లాట్ ఫాం వద్ద పత్తి విత్తనాల సంచులను గుర్తించారు. అధికారులు రావటంతో విత్తనాలు తీసుకువచ్చిన ఇద్దరు వ్యక్తులు పరారయ్యారు. పారిపోయే క్రమంలో వారి సెల్ ఫోన్ కింద పడిపోవటంతో దానిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సంచులు తెరచి చూడగ పత్తి విత్తనాలు ఉన్నాయి. విత్తనాలు ఇలా విడిగా తరలించటం, విక్రయించటం నేరమని తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తామని వారు వెల్లడించారు. వారి సాయంతో నిందితుల్ని పట్టుకుంటామని విశ్వాసం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details