గుంటూరు జిల్లాలో ఇవాళ 4 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య 421కి చేరింది. కొత్తగా వచ్చిన కేసుల్లో నరసరావుపేటలో 2, తాడేపల్లి మండలం పెనుమాకలో ఒకటి, నాగార్జున యూనివర్శిటీ క్వారంటైన్ కేంద్రంలో ఒక కేసు నమోదయ్యాయి. తాజా కేసులతో నరసరావుపేటలో పాజిటివ్ కేసుల సంఖ్య 180కి చేరాయి. ఇవాళ నరసరావుపేటలో వచ్చిన 2 కేసుల్లో ఒకటి వరవకట్టలో రాగా.. రెండోది శ్రీనివాసనగర్‌లో వచ్చింది. ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి వస్తున్న విద్యార్ధులను నాగార్జున యూనివర్శిటీలోని క్వారంటైన్ కేంద్రానికి తరలిస్తున్నారు. దిల్లీ నుంచి వచ్చి క్వారంటైన్ లో ఉన్న ఓ విద్యార్ధికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో అతన్ని కలిసిన వారిని గుర్తించే పనిలో పడ్డారు. నరసరావుపేటలో కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతండటం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. మిషన్ మే-15 పేరిట అధికారులు చేపట్టిన కార్యచరణ పూర్తి ఫలితాన్ని ఇవ్వలేదు. మే 15 తర్వాత కేసులు నమోదవుతుండటంతో వైరస్ నియంత్రణపై అధికారులు ఆందోళన చెందుతున్నారు.
జిల్లాలో తాజాగా 4 కరోనా పాజిటివ్ కేసులు - గుంటూరులో కరోనా కేసుల వివరాలు
గుంటూరు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా 4 కేసులు నమోదుకావడంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు. గుంటూరు జిల్లాలో ఇప్పటివరకు 421 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
corona positive