ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆ ప్రజాప్రతినిధికి కరోనా నెగిటివ్ - Corona Negative Cases in Guntur

కరోనా అనుమానిత లక్షణాలతో ఐసోలేషన్ కేంద్రంలో చేరిన గుంటూరుకు చెందిన ప్రజాప్రతినిధి, అతని కుటుంబ సభ్యులకు ఉపశమనం లభించింది. ప్రజాప్రతినిధితోపాటు కుటుంబ సభ్యులు, సహచరుల నమూనాలను పరీక్షలకు పంపగా నెగిటివ్​గా నిర్ధారణ అయ్యాయి.

ఆ ప్రజాప్రతినిధికి కరోనా నెగిటివ్
ఆ ప్రజాప్రతినిధికి కరోనా నెగిటివ్

By

Published : Mar 29, 2020, 10:38 PM IST

కరోనా అనుమానిత లక్షణాలతో ఐసోలేషన్ కేంద్రంలో చేరిన గుంటూరుకు చెందిన ప్రజాప్రతినిధి, అతని కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. ఇటీవల ప్రజాప్రతినిధి సమీప బంధువు దిల్లీ వెళ్లి కరోనా బారిన పడ్డారు. అతనితో పాటు అతని సమీప బంధువు, అతనితో కలిసి సంచరించిన మరో ఇద్దరికి పాజిటివ్ రావటంతో అంతా ఆందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో ప్రజాప్రతినిధి రెండురోజుల పాటు హోం ఐసోలేషన్​లో ఉన్నారు. అనంతరం అన్ని వర్గాల నుంచి ఒత్తిడితో రావటంతో ముందస్తు జాగ్రత్త చర్యగా కాటూరి వైద్యకళాశాల ఆస్పత్రి ఐసోలేషన్ కేంద్రంలో చేరగా... పరీక్షలు నిర్వహించారు. చివరకు నెగెటివ్ రావటంతో ప్రజాప్రతినిధితో పాటు బంధువులు, అనుచరులు ఉపశమనం పొందారు.

ఇదీ చూడండి:డ్రోన్ ​షాట్స్​: కరోనా నియంత్రణలో మున్సిపల్ మైదానం

ABOUT THE AUTHOR

...view details