కరోనా వైరస్ పట్ల తగిన అవగాహన పెంచుకోవాలని.. జాగ్రత్తగా ఉండాలని... ప్రజలు భయపడవద్దని గుంటూరు సర్వజనాస్పత్రి మానసిక వైద్య నిపుణుడు మురళీకృష్ణ తెలిపారు. కరోనా ప్రాణాంతకమైన వ్యాధి కాదన్నారు. మరణాల రేటు స్వల్పమని ప్రజలు గుర్తించాలని కోరారు. ఈ వైరస్ గురించి వాస్తవిక అవగాహనతో మెలగాలని... ఎవరూ నిరాశకు లోనుకావద్దని చెప్పారు. వ్యాధి గురించి పిల్లలతో సహా కుటుంబ సభ్యులందరూ చర్చించుకోవాలని సూచించారు.
గతంలో వచ్చిన వ్యాధుల గురించి సైతం పిల్లలకు వివరించాలని మురళీకృష్ణ కోరారు. వేళకు నిద్రపోవడం, బలవర్థక ఆహారం తీసుకోవడం ద్వారా వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవాలన్నారు. కుటుంబ సభ్యుల మధ్య ఆరోగ్యకర సంబంధాలు బలపడటానికి... కొత్త అంశాలు నేర్చుకోవడానికి లాక్ డౌన్ సమయం మంచి అవకాశమని అభిప్రాయపడ్డారు. మరిన్ని అభిప్రాయాలను ఈటీవీ భారత్ నిర్వహించిన ముఖాముఖిలో పంచుకున్నారు.