గుంటూరు జిల్లాలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఇవాళ ఒక్కరోజే జిల్లాలో 70 పాజిటివ్ కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. దీంతో జిల్లాలో కేసుల సంఖ్య 1,014కు చేరింది. కొత్త కేసుల్లో గుంటూరు నగరంలో 27 తెనాలిలో 13, తాడేపల్లి 12, నరసరావుపేట 3, మాచర్ల 2, మంగళగిరి 5, బాపట్ల 2 పాజిటివ్ కేసులు వచ్చాయి.
అలాగే సత్తెనపల్లి, నంబూరు, నిజాంపట్నం, పెదనందిపాడు, కనపర్రు, రేవేంద్రపాడులో 1 చొప్పున నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఇవాళ పాజిటివ్‌గా తేలిన వారిలో 10మంది ఇప్పటికే క్వారంటైన్ కేంద్రాల్లో ఉన్నారు. గుంటూరు నగరంలో అంకిరెడ్డి పాలెంలో2, డీయస్ నగర్ 1, వెంకట రామయ్య కాలనీ 1, ఏ.టి అగ్రహారం 1, పట్టాభిపురం 2, ఆర్టీసీ కాలనీ 1 , కే వీపీ కాలనీ 1, గుండరావుపేట 1, నల్లచేరువు 1, ఐపీడీ కాలనీ 6, కాటూరి మెడికల్ కాలేజ్ క్వారంటైన్ 3, బృందావన్ గార్డెన్స్ 1, సంగడిగుంట 3, లాలపేట 1, చౌడవరం 1, శ్యామలా నగర్ 1 కేసులు నమోదయ్యాయి. కొత్త కేసులతో కలిపి గుంటూరు నగరంలో కేసుల సంఖ్య 367, నరసారావుపేటలో 232, తాడేపల్లిలో 109, తెనాలిలో 37, మంగళగిరిలో 26, మాచర్లలో 17కు చేరుకున్నాయి.