గుంటూరు జిల్లాలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. మంగళవారం కొత్తగా 91 కేసులు నమోదు కావటంతో జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 1,556కు చేరింది. నగరంలోనే 27 కేసులున్నాయి. ఒక్క బ్రాడీపేటలోనే 13 కేసులు నమోదైనట్లు అధికారులు నిర్ధారించారు. జీజీహెచ్లో రెండు రోజుల క్రితం ఇద్దరు పీజీ వైద్య విద్యార్థులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా వారి ద్వారా మరికొందరికి వైరస్ సోకినట్లు గుర్తించారు. ఐపీడీ కాలనీలో రెండు, సంజీవయ్య నగర్, గోరంట్ల, అడవి తక్కెళ్లపాడు, సంగడిగుంట, గాంధీనగర్, ఆర్.అగ్రహారం, వర్కర్స్ కాలనీల్లో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయి. జిల్లాలోని వివిధ క్వారంటైన్ ప్రాంతాల్లో ఉన్న 26 మందికి కరోనా నిర్ధారణ అయింది. బాధితులతో ప్రైమరీ కాంటాక్టు కలిగిన వారితో పాటు విదేశాల నుంచి వచ్చిన వారిని క్వారంటైన్లో ఉంచి పరీక్షలు చేస్తున్నారు.
కరోనా విళయతాండవం.. తాడేపల్లిలో ఒక్కరోజే 13 కేసులు - today corona cases in guntur news update
గుంటూరు జిల్లాలో రోజు రోజుకు కరోనా కేసులు తారా స్థాయిలో పెరుగుతున్నాయి. కొత్తగా 91 కేసులు నమోదవ్వటంతో జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 1556కు చేరింది. సీఎం నివాసం ఉండే తాడేపల్లి ప్రాంతంలో మంగళవారం ఒక్కరోజే మరో 13 కేసులు వచ్చాయి.
గుంటూరులో కరోనా విళయతాండవం
ఇక సీఎం నివాసం ఉండే తాడేపల్లి ప్రాంతంలో మంగళవారం ఒక్కరోజే మరో 13 కేసులు వచ్చాయి. అలాగే మంగళగిరి మండలం, పెదకాకానిలో తొమ్మిది, మాచర్లలో నాలుగు కేసులు నమోదయ్యాయి. చిలకలూరిపేట, పిడుగురాళ్ల, తుళ్లూరులో ఒక్కో కేసు చొప్పున నమోదైనట్లు జిల్లా వైద్యఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. తాజాగా వచ్చిన కేసులతో కలిపి గుంటూరులో 605, నర్సరావుపేటలో 256, తాడేపల్లిలో165, మంగళగిరిలో 63, పెదకాకానిలో 22, తెనాలిలో 62, చిలకలూరిపేటలో 23 నమోదయ్యాయి.