ఇప్పటికే కరోనా కేసులతో అల్లాడుతున్న గుంటూరు జిల్లా నరసరావుపేటలో మరో పాజిటివ్ కేసు నమోదైంది. దీంతో అక్కడ మొత్తం కేసుల సంఖ్య 200కు చేరుకుంది. కొత్త కేసు పట్టణంలోని వరవకట్ట ప్రాంతంలో వెలుగుచూసిందని అధికారులు తెలిపారు. లాక్ డౌన్ సడలించినందున ఉదయం 7 నుంచి సాయంత్రం 7 వరకు ప్రజలు బయటకు వస్తున్నారు. ఈ సమయంలో జాగ్రత్తలు పాటించాలని అధికారులు కోరారు. మాస్కులు, శానిటైజర్లు వంటివి ఉపయోగించాలని సూచించారు.
నరసరావుపేటలో మరో కరోనా కేసు... మొత్తం 200 - నరసరావుపేటలో కరోనా కేసులు తాజా వార్తలు
గుంటూరు జిల్లా నరసరావుపేటలో కొత్తగా నమోదైన కరోనా కేసుతో పట్టణంలో మొత్తం కేసుల సంఖ్య 200కు చేరుకుంది. ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని.. బయటకు వెళ్లినప్పుడు మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటివి చేయాలని అధికారులు సూచించారు.
Breaking News