గుంటూరు జిల్లాలో మంగళవారం కొత్తగా 43 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. గుంటూరు నగరంలోనే 22 కేసులు నమోదయ్యాయి. నరసరావుపేటలో 3, తాడేపల్లిలో 9, మాచర్లలో 3, అంగలకుదురు, తెనాలి, అగత్తవరప్పాడు, కె.ఎం.అగ్రహారం, వెదుళ్లపల్లి, నాదెండ్లలో ఒక్కో కేసు చొప్పున నమోదైనట్లు అధికారులు తెలిపారు.
జిల్లాలో కరోనా ఉద్ధృతి.. 965కు చేరిన కేసులు - గంటూరు జిల్లాలో కరోనా కేసులు
గుంటూరు జిల్లాలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. మంగళవారం మరో 43 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 965కు చేరుకుంది. ఈ క్రమంలో అధికారులు అప్రమత్తమయ్యారు.
జిల్లాలో మరో 43 పాజిటివ్ కేసులు నమోదు !
మంగళవారం పాజిటివ్ వచ్చిన వారిలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి క్వారంటైన్లో ఉన్నవారు ఐదుగురు ఉన్నట్లు వెల్లడించారు. జిల్లాలో కేసుల సంఖ్య 965కు చేరుకుంది. జిల్లాలో ఇప్పటివరకు కరోనా నుంచి 501 మంది కోలుకున్నారు. 12 మంది మరణించారు. తాజాగా పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించిన అధికారులు పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టారు.