ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గుంటూరు జిల్లాలో పెరిగిన కరోనా కేసులు

బుధవారం వరకు గుంటూరు జిల్లాలో కేసులు కాస్త తగ్గుముఖం పట్టినా... గురువారం కేసులు సంఖ్యలు పెరిగాయి. ఈ ఒక్క రోజులో 13 కేసులు నమోదు కావడం వల్ల అధికారలు అప్రమత్తమయ్యారు. ఇప్పటివరకు గుంటూరు, నరసరావుపేటలో మాత్రమే ఎక్కువగా నమోదు కాగా... ఇప్పుడు కొత్త ప్రాంతాల్లో కేసులు నమోదవుతున్నాయి.

By

Published : May 29, 2020, 7:48 AM IST

corona cases are again increasing in guntur disrict
జిల్లాలో ఒక్కసారిగా పెరుగుతున్ కేసులు

గుంటూరు జిల్లాలో కరోనా కేసులు మళ్లీ విజృంభించాయి. గురువారం ఒక్కరోజే 13 కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 465కి పెరిగింది. బుధవారం వరకు జిల్లాలో కేసుల సంఖ్య కాస్త నెమ్మదించగా... గురువారం బయటపడిన కేసులతో జిల్లాలో కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగాయి. నిన్న నమోదైన 13 కేసుల్లో చిలకలూరిపేటలో 3, యడ్లపాడులో 3, నరసరావుపేటలో 2, పెనుమాక, చందవరం, తిమ్మాపురం, గొరిజవోలు, తెనాలిలో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయి. గురువారం వరకు గుంటూరు, నరసరావుపేటలో కేసుల ఉద్ధృతి కొనసాగగా... ప్రస్తుతం కొత్త ప్రాంతాల్లోనూ కేసులు నమోదు కావడమనేది ఆందోళన కలిగిస్తోంది.

జిల్లాలో ఒక్కసారిగా పెరుగుతున్ కేసులు

ABOUT THE AUTHOR

...view details