ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గుంటూరులో కాంగ్రెస్ పార్టీ సత్యాగ్రహ దీక్ష - congress party protest in guntur

దేశ వ్యాప్తంగా మహిళలకు రక్షణ కరువైందని...మహిళలకు రక్షణ కల్పించలేని ప్రభుత్వాలు దిగిపోవాలని కాంగ్రెస్ పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షుడు మస్తాన్ వలీ డిమాండ్ చేశారు.

గుంటూరులో కాంగ్రెస్ పార్టీ సత్యగ్రహా దీక్ష
గుంటూరులో కాంగ్రెస్ పార్టీ సత్యగ్రహా దీక్ష

By

Published : Oct 5, 2020, 1:50 PM IST


యూపీలో మహిళ అత్యాచార ఘటనపై కేంద్ర ప్రభుత్వం తీరును నిరసిస్తూ గుంటూరులో కాంగ్రెస్ పార్టీ నేతలు సత్యాగ్రహ దీక్షను చేపట్టారు. కేంద్రంలో భాజపా అధికారంలోకి వచ్చిన తరువాత మహిళలకు రక్షణ లేకుండా పోయిందని కాంగ్రెస్ పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షుడు మస్తాన్ వలీ అన్నారు. తక్షణమే ప్రాంతీయ పార్టీలన్నీఈ ఘటనపై తమ గళం వినిపించాలన్నారు. సీఎం జగన్, చంద్రబాబు, పవన్ కల్యాణ్ ముందుకు వచ్చి బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం చేయాలన్నారు. లేదంటే ప్రాంతీయ పార్టీలన్నీ ప్రధాని మోదీకి ఊడిగం చేస్తున్నట్లేనని ప్రజలు భావిస్తారన్నారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి


మాచవరంలో తెదేపా నేత బొప్పాయి తోట ధ్వంసం

ABOUT THE AUTHOR

...view details