ఉద్యోగ భద్రత కల్పించాలంటూ ఉపాధి హామి పథకం క్షేత్ర స్థాయి సిబ్బంది పంచాయతీరాజ్ కమిషనరేట్ వద్ద ఆందోళనకు దిగారు. 13 జిల్లాల నుంచి సుమారు వెయ్యి మంది ఉద్యోగులు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. క్షేత్ర సహాయకులుగా పనిచేస్తున్న తమకు గ్రామ సచివాలయాలలో అవకాశం కల్పించాలని వారు కమిషనర్ కు విజ్ఞప్తి చేశారు. సర్వీసు క్రమబద్దీకరణపై త్వరలో ఓ నిర్ణయం వెలువడనుందని కమిషనర్ గిరిజా శంకర్ వారికి తెలిపారు. గ్రామ సచివాలయ పోస్టులకు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన వెల్లడించారు.
ఉద్యోగ భద్రతకై ఆందోళన - పంచాయతీరాజ్ కార్యలయం
ఉద్యోగ భద్రత కల్పించాలంటూ గుంటూరు జిల్లాలో ఉపాధి హామి పథకం ఉద్యోగులు ఆఁదోళనకు దిగారు. 13 జిల్లాల నుంచి సుమారు వెయ్యి మంది క్షేత్ర స్థాయి సహాయకులు రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయం నిరసన చేపట్టారు.
ఉద్యోగ భద్రత కల్పించాలంటూ..ఆందోళన