ఇళ్ల స్థలాల వ్యవహారంలో గ్రామ రెవెన్యూ అధికారులు లంచాలు తీసుకుంటున్నారని గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం కొర్రపాడు గ్రామస్థులు ఆరోపించారు. ఈ విషయంపై గ్రామపంచాయతీ కార్యాలయం ఆందోళన నిర్వహించారు. ప్రభుత్వం పేదలకు నివాస స్థలాన్ని ఇస్తోందని, లబ్ధిదారుల జాబితా తయారు చేసిన రెవెన్యూ అధికారులు.. అర్హుల పేర్లు తొలగించి, అనర్హుల పేర్లను ఉంచి అవినీతికి పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే గ్రామ రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
న్యాయం చేయాలని కొర్రపాడు గ్రామస్థుల ఆందోళన - గుంటూరు జిల్లాలో ఆందోళన
గుంటూరు జిల్లా కొర్రపాడులో స్థానికులు ఆందోళన చేశారు. ఇళ్ల స్థలాల వ్యవహారంలో రెవెన్యూ అధికారులు అక్రమాలకు పాల్పడ్డారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
కొర్రపాడు గ్రామ సచివాలయ భవనం