ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తహసీల్దార్ కార్యాలయంలో ఉద్యోగులకు కరోనా పరీక్షలు

గుంటూరు జిల్లా చిలకలూరిపేట తహసీల్దార్ కార్యాలయం వద్ద ఉద్యోగులకు కావూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో కోవిడ్ పరీక్షలు నిర్వహించారు. చిలకలూరిపేట నియోజకవర్గంలో కరోనా పాజిటివ్ బారిన పడుతున్న ఉద్యోగుల సంఖ్య రోజురోజుకు పెరగటంతో పరీక్షలు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

By

Published : Jul 26, 2020, 2:48 PM IST

coivd test to mro office employees in guntur dst chilakalori peta
coivd test to mro office employees in guntur dst chilakalori peta

గుంటూరు జిల్లా చిలకలూరిపేట తహసీల్దార్ కార్యాలయం ఉద్యోగులకు కరోనా పరీక్షలు చేశారు. నియోజకవర్గ పరిధిలో ఉద్యోగులకు కరోనా పాజిటివ్ రావటంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే రూరల్ పోలీస్ సర్కిల్ కార్యాలయంలో సీఐ, ఎస్సైతో పాటు నలుగురు కానిస్టేబుళ్లు, ఐదుగురు హోంగార్డులు కోవిడ్ బారిన పడ్డారు.

అలాగే ఎక్సైజ్ పోలీస్ స్టేషన్​లో ఒక కానిస్టేబుల్​కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. తహసీల్దార్ కార్యాలయంలో పనిచేసే ఒక వీఆర్వో గ్రామ సచివాలయంలో విధుల్లో ఉన్న ఒక ఉద్యోగికి కూడా పాజిటివ్ నిర్ధరణ అయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగులందరికీ తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో కొవిడ్ పరీక్షలు నిర్వహించారు.

ABOUT THE AUTHOR

...view details