''ప్రాజెక్టులపై సమీక్షకు జిల్లాల వారీగా కమిటీలు'' - cm review
రాష్ట్రంలో వివిధ సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై సీఎం జగన్.. అధికారులతో సమీక్షించారు. ప్రాజెక్టులపై సమీక్షకు జిల్లాలవారీగా కమిటీ వేయాలని నిర్ణయించారు. జిల్లాలో ముగ్గురేసి ఎమ్మెల్యేలు, ఇంజినీరింగ్ అధికారులతో కమిటీ వేయనున్నట్లు వెల్లడించారు.
అమరావతిలో జలవనరులశాఖపై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష నిర్వహించారు.ప్రాజెక్టులపై సమీక్షకు జిల్లాలవారీగా కమిటీ వేయాలని నిర్ణయించారు.జిల్లాలో ముగ్గురేసి ఎమ్మెల్యేలు,ఇంజినీరింగ్ అధికారులతో కమిటీ వేయనున్నట్లు వెల్లడించారు. భైరవానితిప్ప,ఎగువ పెన్నా ప్రాజెక్టుల్లో భారీగా అంచనాలు పెంచారని జగన్ అన్నారు.ప్రాజెక్టుల వ్యయాన్ని తగ్గించి డీపీఆర్ రూపొందిస్తే అవార్డులు ఇవ్వాలని నిర్ణయించారు.పోలవరం ప్రాజెక్టులో డీజిల్ కోసం రూ.50కోట్లు విడుదలకు నిర్ణయం తీసుకున్నారు.కాంట్రాక్టు సంస్థకు రూ.50కోట్లు విడుదల చేస్తున్నట్లు తెలిపారు.సముద్రంలో కలిసే గోదావరి జలాలకు సంబంధించి మరోమారు పూర్తి వివరాలు అందించాలని సూచించారు.విస్తృతస్థాయి నివేదిక ఇవ్వాలని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌కు ఆదేశాలు జారీ చేశారు.