CM Jagan Review on Medical and Health Department: ఆరోగ్యశ్రీ సేవలను పొందడంపై ప్రతి ఒక్కరికీ ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పించాలని అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు. సెప్టెంబరు 15 నుంచి ఈ కార్యక్రమం నిర్వహించేందుకు అన్ని రకాలుగా సిద్ధం చేసుకోవాలని, దీనికోసం ముమ్మరంగా ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించాలని స్పష్టం చేశారు. వైద్య ఆరోగ్యశాఖపై సమీక్షించిన సీఎం ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.
ఆరోగ్యశ్రీ సేవలను ఎలా పొందాలన్న దానిపై సమగ్ర వివరాలతో ప్రతి కుటుంబానికీ బుక్ లెట్ అందిందాలని సీఎం ఆదేశించారు. విలేజ్ క్లినిక్(Village Clinic) సిబ్బంది, ఏఎన్‌ఎంలు, ఆశావర్కర్లు, వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది ద్వారా పూర్తి వివరాలతో సమాచారం అందించాలన్నారు. ప్రతి ఇంటికీ వెళ్లి ఆరోగ్య శ్రీ గురించి సవివరంగా తెలియజేయాలన్నారు. ఒక్క యాప్ ద్వారానే కాకుండా ఇతర మార్గాల ద్వారా, కాల్ సెంటర్ల ద్వారా ఆరోగ్యశ్రీ సేవలు పొందడంపై పూర్తి అవగాహన ఉండాలని సూచించారు.
CM Jagan Suggests AI: టీచర్ల కొరతను ఏఐతో అధిగమించండి.. పాఠశాల విద్యపై సమీక్షలో సీఎం సూచన
ఆరోగ్య శ్రీ కింద అందే చికిత్సల సంఖ్యను వైసీపీ ప్రభుత్వం(YCP Government) రాకముందు 1000 ఉంటే, ఇప్పుడు 3,255కి పెంచామని, ఈ సేవలను పొందడంపై ప్రజలకు పూర్తి అవగాహన, సమాచారం ఉండాలని సీఎం చెప్పారు. ప్రభుత్వ రంగంలోని మెడికల్ కాలేజీలు, ఆస్పత్రుల నిర్వహణ అత్యంత సమర్థవంతంగా ఉండాలన్న సీఎం.. నిర్వహణకు నిధులు సమస్య రాకుండా చూసుకునేందుకు ఒక విధానం తీసుకురావాలని అధికారులకు ఆదేశించారు. ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ (Arogyasri) కింద అందించే నిధులు ఆయా ఆస్పత్రుల నిర్వహణకు వినియోగించేలా ఒక పద్ధతిని తీసుకురావాలన్నారు. శస్త్రచికిత్స తర్వాత విశ్రాంతి కాలానికి ఆరోగ్య ఆసరా పథకం కింద రోగికి ఇవ్వాల్సిన డబ్బును డిశ్చార్జి రోజే అందించాలని సీఎం నిర్దేశించారు. దీనికి కావాల్సిన ఎస్‌ఓపీని రూపొందించాలని సూచించారు.