ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

CM Jagan Fake Propaganda on State Progress: "వేదికేదైనా.. అలవోకగా అబద్ధాలు". ఇదీ మన ముఖ్యమంత్రి తీరు - స్పీచ్​లో సీఎం జగన్​ అబద్ధాలు

CM Jagan Fake Propaganda on State Progress: ప్రభుత్వ కార్యక్రమమా, పార్టీ సభా అన్న తేడా లేదు! సందర్భ శుద్ధి అసలే లేదు! ప్రభుత్వ ఖర్చుతో నిర్వహిస్తున్న బహిరంగ సభల్లోనూ విపక్షాల్నీ, పత్రికలను కలగలిపి విమర్శలు చేసే కొత్త సంప్రదాయానికి ఆద్యుడైన ముఖ్యమంత్రి జగన్.. మంగళవారం నాటి స్వాతంత్య్ర వేడుకనీ వదల్లేదు. వైసీపీ అంతర్గత సమావేశంలోనో, ప్లీనరీలోనో మాట్లాడినట్లుగా విపక్షాలపై అడ్డగోలుగా విమర్శలు చేశారు. ఆ క్రమంలో అనర్గళంగా అబద్ధాలూ చెప్పేశారు.

CM_Jagan_Fake_Propaganda_on_State_Progress
CM_Jagan_Fake_Propaganda_on_State_Progress

By

Published : Aug 16, 2023, 11:25 AM IST

CM Jagan Fake Propaganda on State Progress: స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ముఖ్యమంత్రి జగన్‌.. వివిధ రంగాలపై చెప్పిన విషయాలకు వాస్తవాలకు పొంతన లేకుండా పోయింది. సుప్రీంకోర్టులో కేసు విచారణలో ఉందన్న విషయం మరచి మూడు రాజధానుల అంశాన్నీ ప్రస్తావించారు. జగన్ సీఎం అయ్యి, గ్రామ సచివాలయ వ్యవస్థను ప్రవేశపెట్టడం వల్లే గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం సాకారమైందన్నట్టుగా సొంత భాష్యం చెప్పారు.

IB Syllabus in AP Schools: ప్రభుత్వ బడుల్లో మరో కొత్త సిలబస్.. ఇంటర్ వరకు ఐబీ అమలు దిశగా అడుగులు

CM jagan Lies in Independence Day Celebration Speech: వైసీపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు కడుతున్న వేగం చూసి తాబేళ్లు కూడా సిగ్గుపడుతాయి. కానీ జగన్ తన ప్రసంగంలో పోలవరం ప్రాజెక్టు పనులు వడివడిగా జరుగుతున్నాయని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం అని ఒకసారి.. CBSE, ఆన్లైన్ క్లాస్లు అని మరోసారి, కాదు కాదు అంతర్జాతీయ సిలబస్ అని మరోసారి చెప్పారు. ఇలా పద్ధతి లేకుండా మొత్తం విద్యా వ్యవస్థను గందరగోళం చేసి, పేద పిల్లలకు విద్యను దూరం చేయడమేనా వారిని ఉద్దరించడమంటే! సామాజిక న్యాయం అన్న మాట తనతోనే పుట్టిందన్నట్టుగా, తానేదో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలను ఉద్దరించడానికి వచ్చిన అభినవ అంబేడ్కరో, జ్యోతి రావు పూలేనో అన్నట్టుగా తెగ డాంబికాలు పలికారు.

YSR Zero Interest Scheme: మహిళా వికాసం కోసం సంక్షేమ పథకాలు: సీఎం జగన్​

CM Jagan Lies on Positions to Minorities in Cabinet: మంత్రి మండలిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 68 శాతం పదవులు ఇచ్చామని, ఐదుగురు ఉప ముఖ్యమంత్రుల్లో నలుగురు ఆ వర్గాలవారేనని ముఖ్యమంత్రి గొప్పలు చెప్పారు. శాసనసభ స్పీకర్ బీసీ, శాసనమండలి చైర్మన్‌గా ఎస్సీ నాయకులకు అవకాశం ఇచ్చామన్నారు. కానీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు పేరుకే పదవులిచ్చి, వారిపై అగ్రవర్ణాలవారితో పెత్తనం చేయించడమేనా మీరు తెచ్చిన గొప్ప సామాజిక మార్పు!.

ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామిని ఏనాడైనా స్వతంత్రంగా ఒక చిన్న నిర్ణయమైనా తీసుకోనిచ్చారా? మీ పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు ఎంత స్వతంత్రంగా పదవులు నిర్వహిస్తున్నారో ఆయనను చూస్తే తెలీదా? అయినా వైసీపీ అధికారంలోకి వచ్చాకే.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, బడుగు, బలహీనవర్గాలను , మైనారిటీలకు పదవులు దక్కినట్టుగా గొప్పలు చెబుతున్నారే!. గతంలో లోక్​సభ స్పీకర్​గా పని చేసిన బాలయోగి, అంతకు ముందు స్పీకర్ యనమల రామకృష్ణ బీసీ కాదా?ప్రతి సంవత్సరం మే నెలలో ఒకేసారి 12వేల 500 రూపాయల చొప్పున రైతు ఖాతాలో వేస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చి.. అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ ఖజానా నుంచి రూ. 7వేల 500 మాత్రమే ఇవ్వడాన్ని ఏమంటారు?. పీఎం కిసాన్ కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రూ.6 వేలూ కలిపి.. మొత్తం రూ.13వేల 500 మీరే ఇస్తున్నట్టుగా రైతుల్ని నమ్మించాలనుకోవడం వారిని మోసగించడం కాదా?.

Upper Caste Domination in AP నా ఎస్సీలు అంటూనే.. జీరోలను చేశారు! ఇదేనా సామాజిక విప్లవం..?

Jagan Govt Cheating the SC and BC Communities: ప్రత్యక్ష ఎన్నికల్లో ప్రజల ఓట్లతో గెలిచిన సర్పంచుల్ని ఉత్సవ విగ్రహాలుగా మార్చేసి.. వాలంటీర్లు, గ్రామ సచివాలయ సిబ్బందితో వారిపై పెత్తనం చేయించడమేనా గ్రామ స్వరాజ్యాన్ని స్థాపించడమంటే?. పేదలు ఎక్కే బస్సును ప్రైవేటుకు అమ్మేయాలని చూడటమూ అంటరానితనమే అని సెలవిచ్చిన ముఖ్యమంత్రి.. అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో అదే ఆర్టీసీ బస్సుల్లో ఛార్జీల్ని మూడు దఫాలుగా పెంచేసి, ఏటా 2 వేల కోట్ల రూపాయల చొప్పున అదనపు భారం వడ్డించడం పేదల్ని ఉద్దరించడమా?. వివిధ కులాలకు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేయడంతోనే వారి జీవితాల్లో విప్లవాత్మక మార్పులు వచ్చేసినట్టుగా సీఎం జగన్ గొప్పలు చెబుతున్నారు. కానీ నిజానికి ఆ కార్పొరేషన్ల పేరుతో జగన్ ప్రభుత్వం ఎస్సీ, బీసీ వర్గాలను నిలువునా మోసం చేస్తోంది.

Pulses Cultivation Reduced in AP: నీటిమీద రాతలుగానే జగన్​ హామీలు.. ‘చిరు’సాయమూ కరవే!

CM Jagan Lies on Investments: 2019 జూన్ నుంచి నేటి వరకు రాష్ట్రంలో 127 భారీ పరిశ్రమలు నెలకొల్పామని, వాటి ద్వారా రూ.67వేల 196 కోట్ల పెట్టుబడులు వచ్చాయని సీఎం అలవోకగా చెప్పేశారు. నిజంగానే అన్ని వేల కోట్ల పెట్టుబడులు వచ్చి ఉంటే రాష్ట్ర పారిశ్రామిక ముఖ చిత్రమే మారిపోయి ఉండేది. ఏ ప్రభుత్వమైనా ఉన్న పరిశ్రమల్ని కాపాడుకుంటూ, కొత్త పరిశ్రమల పెట్టుబడుల కోసం కృషి చేస్తుంది. కానీ వైసీపీ ప్రభుత్వం, పార్టీ చేసిందేంటి? వేల మందికి ఉపాధి కల్పిస్తున్న అమరరాజ పరిశ్రమపై కక్ష సాధింపునకు పాల్పడ్డారు. దాని వల్లే కదా వారు పొరుగు రాష్ట్రాల్లో కొత్త యూనిట్లను ఏర్పాటు చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలోనే పూర్తి చేసి, ప్రారంభించేసిన కర్నూలు విమానాశ్రయాన్ని మేమే పూర్తి చేశామని సీఎం చెప్పడం హాస్యాస్పదం కాదా?.

AP Govt Debt Taking Attempt Failed on Beverages Corporation: రుణ సమీకరణకు యత్నం.. మరోసారి వైసీపీ ప్రభుత్వానికి చుక్కెదురు

Jagan Fake Propaganda on Polavaram: 2025 జూన్ నాటికి పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం అన్న సీఎం జగన్‌.. దీనిపై ఇప్పటికి ఎన్నోసార్లు నాలుక మడతపెట్టారు. మూడుసార్లు గడువు పెంచారు. ప్రస్తుత వైసీపీ పాలనా కాలంలో ప్రాజెక్టు నిర్మాణం పూర్తవదనీ మీరే(సీఎం జగన్​) చెప్పేశారు. మీరు అధికారంలోకి వచ్చిన తొలి రెండేళ్లు పోలవరం ప్రాజెక్టును నిర్లక్ష్యం చేయడం వల్లే కదా ఈ సమస్యలన్నీ!.

CM Jagan on Assigned Lands: ఎసైన్డ్ భూములపై లబ్దిదారులకు 20 ఏళ్ల అనంతరం పూర్తి హక్కులు కల్పించడం ద్వారా ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల వారే ప్రయోజనం పొందుతారని జగన్ ఊదరగొడుతున్నారు. కొన్నిచోట్ల పెత్తందారులు పేదల నుంచి ఈ భూములను ఇప్పటికే లాగేసుకున్నారు. అన్యాక్రాంతమైన ఎసైన్డ్ భూములను 9/77 చట్ట ప్రకారం స్వాధీనం చేసుకొని.. అసలైన లబ్దిదారులకు అప్పజెప్పాలని కోనేరు రంగారావు కమిటీ చేసిన సిఫార్సుల్ని ప్రభుత్వం ఎందుకు పరిగణనలోకి తీసుకోవడం లేదు!.

Agri Testing Labs Service in AP: నాలుగేళ్లవుతున్నా నెరవేరని జగన్ హామీలు.. నాణ్యత పరీక్షకు ఇంకెన్నాళ్లో..!

తానేదో గొప్ప ప్రజాస్వామ్యవాదినన్నట్లు కబుర్లు చెప్పిన జగన్.. నాలుగేళ్లుగా చేస్తున్నదేంటి? రాష్ట్రంలో ప్రజల భావ ప్రకటన స్వేచ్ఛను కాలరాస్తున్నదెవరు?. ప్రజాగళమై నిలుస్తున్న పత్రికలపై అక్రమ కేసులు పెడుతూ.. కలానికి సంకెళ్లు వేయాలని చూస్తున్నదెవరు?. ప్రభుత్వ వైఫల్యాలు, విధానాల్లోని లోపాల్ని ఎత్తిచూపుతున్న వారిపై ఉక్కుపాదం మోపుతున్నదెవరు?. హక్కుల కోసం గళమెత్తుతున్న ఉద్యోగ ఉపాధ్యాయ, కార్మిక, ప్రజా సంఘాల స్వేచ్ఛను హరిస్తున్నదెవరు?.

సామాజిక మాధ్యమాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టు పెట్టటమే నేరమన్నట్లు అడ్డగోలు కేసులు పెట్టి వేధిస్తు జీవో నంబర్ 1 తీసుకొచ్చి ప్రతిపక్షాలు గొంతు నొక్కాలని చూసిందెవరు?. వీటన్నింటికీ బాధ్యుడు మీరు కాదా జగన్ ? స్థానిక ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులను నామినేషన్లు కూడా వేయనివ్వకుండా అడ్డుకోవటమే భావ స్వతంత్రమా! ఇంతలా అణచివేత ప్రదర్శిస్తున్న మీరే.. భావ స్వేచ్ఛ గురించి మాట్లాడటం విడ్డూరం కాక మీరేంటి?.

CM Jagan Suggests AI: టీచర్ల కొరతను ఏఐతో అధిగమించండి.. పాఠశాల విద్యపై సమీక్షలో సీఎం సూచన

ABOUT THE AUTHOR

...view details