కార్యకర్తల కష్టానికి, త్యాగానికి తగిన గుర్తింపు ఇస్తామనీ.. తెదేపా కార్యకర్తల భద్రత తన బాధ్యతని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టంచేశారు. అన్ని సర్వేలు తెదేపా గెలుపునే నిర్ధరిస్తున్నాయన్నారు. ఈవీఎంలపై ఓటర్లలో అవగాహన పెంచాలని సూచించారు. ఓటమి భయంతో మోదీ, జగన్‌లో అసహనం పెరిగిపోయిందనీ.. వైకాపా నేతలు రాక్షసుల్లా మారారని ఆరోపించారు. నీళ్లకు పార్టీ ఉంటుందా..? వైకాపా నీళ్లు-తెదేపా నీళ్లు ఉంటాయా అని ప్రశ్నించారు. ఇలాంటి రాక్షస పార్టీకి ఎవరైనా ఓట్లు వేస్తారా అని అడిగారు. వారి దాడులకు అడ్డు లేకుండా పోతోందనీ.. పొరపాటున అధికారంలోకి వస్తే జనాన్ని బ్రతకనివ్వరని మండిపడ్డారు. ఏపీకి అన్యాయం ఎక్కడ జరిగిందని అమిత్ షా అంటున్నారనీ... ఆంధ్రాకు అన్నింటిలోనూ భాజపా అన్యాయమే చేసిందని ధ్వజమెత్తారు. ఏపికి అన్యాయం చేసే మోదీ దృఢ చిత్తం జగన్ కు నచ్చిందా అని ప్రశ్నించారు. ప్రత్యేక హోదాపై చెప్పడానికే జగన్మోహన్ రెడ్డి భయపడ్డారని ఎద్దేవా చేశారు.
6 ప్రశ్నలకు సమాధానమివ్వండి
రాష్ట్ర ప్రజలంతా జగన్‌ను 6 ప్రశ్నలపై నిలదీయాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.
1.ప్రత్యేక హోదాపై కేసీఆర్‌తో ఎందుకు బహిరంగ ప్రకటన చేయించలేదు?