ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అందరూ ఆశ్చర్యపోయేలా.. అమరావతి కడతా: చంద్రబాబు - బహిరంగ

"అందరూ ఆశ్యర్యపోయేలా రాజధాని కడతాను. ఈ ఐదేళ్లలో ఎవరూ ఊహించని సంక్షేమ పథకాలు అమలు చేశాను. తాడికొండ, మంగళగిరి, పెదకూరపాడును అభివృద్ధి చేస్తా" చంద్రబాబు

తాడికొండ ప్రచార సభలో చంద్రబాబు

By

Published : Apr 9, 2019, 5:18 PM IST

ప్రచార సభలో చంద్రబాబు

తాడికొండ నియోజకవర్గం రాష్ట్రానికే తలమానికమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. గుంటూరు జిల్లా తాడికొండలో ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. భవిష్యత్తులో ఎవరూ ఊహించని అభివృద్ధి ఇక్కడ జరుగుతుందన్నారు. ఐదేళ్లులో ఎవరూ ఊహించని సంక్షేమ పథకాలు అమలు చేశామని స్పష్టంచేశారు. అందరూ ఆశ్చర్యపోయేలా అమరావతి కడతామన్నారు. తాడికొండలో ఆస్తుల విలువ పెరిగిందనీ.. వైకాపా అధికారంలోకి వస్తే ఆస్తుల విలువ తగ్గిపోతుందని చెప్పారు. తానుంటే మరో ఐదేళ్లలో హైదరాబాద్‌ ఎత్తిపోతుందనీ.. అందుకే కేసీఆర్‌కు తానంటే భయమని ఎద్దేవా చేశారు. సోనియా హోదా ఇస్తామంటే కేసీఆర్‌ వ్యతిరేకించారని గుర్తుచేశారు. ఇప్పుడు వైకాపా ఓడిపోతుందనే భయంతో కేసీఆర్‌ హోదా అంటున్నారని మండిపడ్డారు. తాడికొండ, మంగళగిరి, పెదకూరపాడును అభివృద్ధి చేస్తాననీ.. మంగళగిరిలో ఇంటిపట్టాల సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details