'మాట్లాడలేకే...కులాల మధ్య చిచ్చు' - chandrababu
అభివృద్ధిపై మాట్లాడలేకే వైకాపా అధినేత జగన్ కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. పార్టీ నేతలతో సీఎం టెలీకాన్పరెన్స్ చేశారు.
అభివృద్ధిపై మాట్లాడలేకే వైకాపా అధ్యక్షుడు జగన్ కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. సామాజిక న్యాయం కోసం పాటు పడే ఏకైక పార్టీ తెలుగుదేశమని పేర్కొన్నారు. అన్ని వర్గాల బాగు కోసమే ఫెడరేషన్లు పెట్టి ప్రోత్సహిస్తున్నామని పార్టీ నేతలతో టెలీ కాన్పరెన్స్‌లో స్పష్టం చేశారు. జగన్ మోదీ పక్షాన ఉండటం చూసి మైనార్టీలు జగన్‌కు దూరమయ్యారన్నారు. అందుకే కులాల మధ్య చిచ్చుకు తెరలేపారని ఆరోపించారు. జగన్‌కు ఉన్న కుల పిచ్చి ఏమిటో అందరికీ తెలుసని ఎద్దేవా చేశారు. తన చిన్నతనం నుంచే సామాజిక న్యాయం కోసమే పోరాడానని సీఎం తెలిపారు.