ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైకాపాలో విభేదాలు: ఎంపీ కారును అడ్డుకున్న ఎమ్మెల్యే అనుచరులు

గుంటూరు జిల్లా చిలకలూరిపేట పురుషోత్తమపట్నంలో వైకాపా నేతల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. విద్యుత్తు ప్రభల వద్దకు వచ్చి తిరిగి వెళ్తున్న ఎంపీ శ్రీకృష్ణదేవరాయులు కారును ఎమ్మెల్యే రజిని అనుచరులు బుధవారం రాత్రి అడ్డుకున్నారు. కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జోక్యం చేసుకున్న పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టి.. ఎంపీని అక్కడి నుంచి పంపించారు.

By

Published : Feb 20, 2020, 10:16 AM IST

Updated : Feb 20, 2020, 2:40 PM IST

ఎంపీ కారును అడ్డుకున్న ఎమ్మెల్యే అనుచరులు
ఎంపీ కారును అడ్డుకున్న ఎమ్మెల్యే అనుచరులు

గుంటూరు జిల్లా చిలకలూరిపేట పురుషోత్తమపట్నంలో.. వైకాపా నేతలు విడదల, బైరా వర్గీయులు మహా శివరాత్రి సందర్భంగా రాత్రి సమయంలో విద్యుత్ ప్రభలను ఏర్పాటు చేశారు. అక్కడికి వచ్చి తిరిగి వెళ్తున్న ఎంపీ శ్రీకృష్ణదేవరాయులు కారును ఎమ్మెల్యే రజిని అనుచరులు అడ్డుకున్నారు. బైరావారి ప్రభపై ఎంపీ మాట్లాడిన అనంతరం బైరా కృష్ణ ఇంటికి వచ్చి వెళ్లేందుకు బయల్దేరారు.

చిలకలూరిపేటకు వచ్చి కనీసం ఎమ్మెల్యేకు సమాచారం కూడా ఇవ్వలేదని, నియోజకవర్గానికి వచ్చిన ప్రతిసారి ఎమ్మెల్యేకు సమాచారం ఇవ్వకుండా వస్తున్నారని విడదల రజిని అనుచరులు ఆగ్రహించారు. ఇరు వర్గాల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది.

ప్రొటోకాల్‌ పాటించడం లేదంటూ పలువురు ఎమ్మెల్యే అనుచరులు ఎంపీ కారును అడ్డుకున్నారు. వాహనం ముందు బైఠాయించి నిరసన తెలిపారు. స్థానిక సీఐ వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. వాగ్వాదాల మధ్య సుమారు 30 నిమిషాల పాటు కారును నిలిపేశారు. అనంతరం పోలీసులు కారు ముందు బైఠాయించినవారిని పక్కకు పంపించి.. ఎంపీ కారును పంపించారు.

ఎంపీ కారును అడ్డుకున్న ఎమ్మెల్యే అనుచరులు

ఇదీ చదవండి:

బోధనా రుసుముల చెల్లింపుల్లో జాప్యం.. విద్యార్థుల అవస్థలు

Last Updated : Feb 20, 2020, 2:40 PM IST

ABOUT THE AUTHOR

...view details