గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం పమిడిమర్రు గ్రామంలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. వైకాపా, తెదేపా శ్రేణుల మధ్య వివాదం జరిగింది. గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి కార్యక్రమాల నేపథ్యంలో ఏర్పాటు చేసిన శిలాఫలకాలను కొందరు వైకాపా శ్రేణులు తొలగించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఇరు పార్టీల శ్రేణులు ఘర్షణకు దిగాయి. ఇరు పార్టీలకు చెందిన ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. వైకాపా శ్రేణులు శిలాఫలకాలను పూర్తిగా ధ్వంసం చేశారు. గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు. విషయం తెలుసుకున్న నరసరావుపేట రూరల్ పోలీసులు హుటాహుటిన గ్రామానికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు.
వైకాపా, తెదేపా శ్రేణుల మధ్య శిలాఫలకాల చిచ్చు - godava
గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం పమిడిమర్రు గ్రామంలో వైకాపా, తెదేపా శ్రేణుల మధ్య చిచ్చు రాజుకుంది. తెదేపా ప్రభుత్వం హయాంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాల శిలాఫలకాలను వైకాపా కార్యకర్తలు తొలగించారన్న ఆరోపణలతో.. తెదేపా నేతలు ఆగ్రహించారు.
వైకాపా, తెదేపా శ్రేణులు మధ్య శిలాఫలకాల చిచ్చు