గుంటూరు జిల్లా బాపట్లలో తెదేపా, వైకాపా మధ్య స్వల్ప ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. తెదేపా అభ్యర్థి అన్నం సతీశ్ ప్రచార సమయంలో వైకాపా అభ్యర్థి రఘుపతి ఇంటి ముందుగా వెళ్తున్నప్పుడు వివాదం చోటు చేసుకుంది. వారి ఇంటి ముందు నుంచి వాహనం వెళ్లటానికి వీలు లేదని వైకాపా కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనితో రెండు వర్గాలు గొడవకు దిగాయి. పోలీసులు రంగంలోకి దిగి కార్యకర్తలకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు..... అనుమతి ఇవ్వమని తెదేపా కార్యకర్తలు పట్టుబట్టగా... పోలీసులు అనుమతిచ్చారు.
బాపట్లలో వైకాపా, తెదేపా కార్యకర్తల మధ్య రగడ - ysrcp
గుంటూరు జిల్లా బాపట్లలో తెదేపా, వైకాపా కార్యకర్తల మధ్య స్వల్ప ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. తెదేపా అభ్యర్థి అన్నం సతీశ్ ప్రచార సమయంలో వైకాపా అభ్యర్థి రఘుపతి ఇంటి ముందుగా వెళ్తున్నప్పుడు వివాదం చోటు చేసుకుంది.
బాపట్లలో వైకాపా, తెదేపా కార్యకర్తల మధ్య రగడ