ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సీఐడీ చీఫ్‌ పీవీ సునీల్‌కుమార్‌ బదిలీ.. జీఏడీలో రిపోర్టు చేయాలని ఆదేశాలు - ఏపీ సీఐడీ అదనపు డీజీ

pv sunil kumar
పీవీ సునీల్ కుమార్

By

Published : Jan 23, 2023, 5:07 PM IST

Updated : Jan 24, 2023, 7:06 AM IST

17:03 January 23

సీఐడీ అదనపు డీజీగా ఎన్‌.సంజయ్‌ నియామకం

సీఐడీ విభాగ అధిపతి పీవీ సునీల్‌ కుమార్‌ను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయనకు ఎక్కడా పోస్టింగ్‌ ఇవ్వలేదు. సాధారణ పరిపాలనశాఖలో రిపోర్టు చేయాలని ఆదేశించింది. 1993 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారైన సునీల్‌ కుమార్‌కు ఇటీవలే అదనపు డీజీ నుంచి డీజీగా పదోన్నతి లభించింది. ఈ నేపథ్యంలో ఆయనను బదిలీ చేయడం, ఎక్కడా పోస్టింగ్‌ ఇవ్వకపోవడం అధికారవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సునీల్‌ కుమార్‌ స్థానంలో సీఐడీ చీఫ్‌గా అగ్ని మాపకశాఖ డైరెక్టర్‌ జనరల్‌ ఎన్‌.సంజయ్‌ను ప్రభుత్వం నియమించింది. ఆయన అగ్ని మాపకశాఖ డైరెక్టర్‌ జనరల్‌గానూ పూర్తి అదనపు బాధ్యతలను నిర్వహిస్తారని పేర్కొంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహర్‌రెడ్డి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.

ఇవీ చదవండి:

Last Updated : Jan 24, 2023, 7:06 AM IST

ABOUT THE AUTHOR

...view details