రాజ్యాంగం ఆమోదం పొంది 70 ఏళ్లైన సందర్భంగా తెదేపా అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచానికే తలమానికంగా దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ పరిఢవిల్లిందని కీర్తించారు. రాజ్యాంగ నిర్మాతల కలలు సాకారం చేయటంతో పాటు వారి ఆదర్శాలను అనుసరించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. శాసన నిర్మాణ, కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థలతో పాటు దీటైన ప్రసార మాధ్యమాలు నాలుగు స్తంభాలుగా రూపొందిన రాజ్యాంగం ప్రజాస్వామ్యానికే నిర్వచనమని కొనియాడారు.
'రాజ్యాంగ నిర్మాతల కలలు సాకారం చేద్దాం'
రాజ్యాంగ ఆమోదానికి 70 ఏళ్లైన సందర్భంగా చంద్రబాబు, లోకేశ్ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. రాజ్యాంగ నిర్మాతల కలలు సాకారం చేద్దామని చంద్రబాబు పిలుపునిచ్చారు. దేశ సార్వభౌమాధికార పరిరక్షణలో పునరంకితమవుదామన్నారు.
chandrababu-tweets