ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కార్యకర్తలకు రక్షణ కవచంలా ఉంటా: చంద్రబాబు - tdp

కార్యకర్తలపై దాడులు జరిగితే సహించేది లేదని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. ప్రభుత్వం స్పందించి శాంతిభద్రతలను కాపాడాలని, లేదంటే పోరాటానికి దిగుతామని వెల్లడించారు.

చంద్రబాబు

By

Published : Jul 4, 2019, 7:51 PM IST

కార్యకర్తలకు బాబు భరోసా

తెదేపా కార్యకర్తలపై వైకాపా దాడులు ఇలానే కొనసాగితే... గ్రామాల్లోనే మకాం వేసి కార్యకర్తలకు రక్షణ కవచంలా ఉంటామని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నేతలకు ధైర్యమిచ్చారు. గుంటూరు పార్టీ కార్యాలయంలో ప్రత్తిపాడు నియోజకవర్గ నేతలతో చంద్రబాబు భేటీ అయ్యారు. హామీలు నెరవేర్చాలని వైకాపాకు అధికారం ఇస్తే.. దాడులకు తెగబడుతున్నారని ఆరోపించారు. దాడులు ఆపే వరకు పోరాటం కొనసాగుతుందని తేల్చి చెప్పారు. తమ ప్రభుత్వ హయాంలో ప్రజలకు ఏం చేయాలో అన్నీ చేశామని... కుటుంబాన్ని ఐదేళ్లు పట్టించుకోకుండా రాత్రీ పగలు అభివృద్ధి, సంక్షేమం కోసం కష్టపడ్డానని తెలిపారు. ఎన్నికలు నిరంతర ప్రక్రియ అని... సంక్షోభాలను అవకాశంగా మలచుకుని శక్తివంతమైన పార్టీగా ఎదుగుదామని నేతలకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details