గుంటూరు జిల్లా అర్బన్ పరిధిలోని అన్ని దేవాలయాల్లో గట్టి నిఘా ఏర్పాట్లు చేశామని ఎస్పీ అమ్మిరెడ్డి తెలిపారు. మంగళగిరి పోలీస్ స్టేషన్లో నూతనంగా ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్‌ను ఆయన ప్రారంభించారు. సంక్రాంతి పండగ నేపథ్యంలో జిల్లాలో కోడి పందాలు జరగకుండా చర్యలు చేపట్టామన్నారు. నిర్వాహకులను కనుగొనేందుకు షాడో బృందాలను పెట్టామని వివరించారు. జిల్లాలో 670దేవాలయాలకుగాను 300 ఆలయాలకు మాత్రమే సీసీ కెమెరాలు ఉన్నాయని పేర్కొన్నారు. మిగిలిన వాటిలో కూడా ఏర్పాట్లకు సన్నాహాలు చేస్తున్నామని ఎస్పీ స్పష్టం చేశారు.
అన్ని దేవాలయాల్లో నిఘా ఏర్పాట్లు చేస్తున్నాం: ఎస్పీ అమ్మిరెడ్డి
గుంటూరు జిల్లా అర్బన్ పరిధిలోని మంగళగిరి పోలీస్ స్టేషన్లో హెల్ప్ డెస్క్‌ను ప్రారంభించారు ఎస్పీ అమ్మిరెడ్డి. దేవుళ్ల విగ్రహాల ధ్వంసం కారణంగా అర్బన్ జిల్లాలోని అన్ని ఆలయాల్లో నిఘా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. సంక్రాంతికి కోడి పందాలు జరగకుండా చర్యలు చేపట్టామని స్పష్టం చేశారు.
ఎస్పీ అమ్మిరెడ్డి