అర్థం లేని ఆరోపణలతో విలువైన కాలం వృథా: చంద్రబాబు - tele
ఆరోపణలకే సభా సమయాన్ని వైకాపా దుర్వినియోగం చేస్తుందని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. ప్రజాసమస్యల్ని పరిష్కరించలేక తెదేపాను లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
babu
తెదేపా వ్యూహ కమిటీ సభ్యులతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. గత ఐదేళ్లలో పోలవరం పనులు 66శాతం పనులు పూర్తిచేశామన్నారు. అర్ధంలేని అవినీతి ఆరోపణలతో విలువైన కాలం వృథా చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టుల పనులు పడకేశాయని..పీపీఏలపై బురద జల్లాలనే ప్రయత్నం అభాసుపాలైందని చెప్పారు.
Last Updated : Jul 16, 2019, 11:18 AM IST