ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

CM Jagan: సీఎం జగన్​ యూరప్‌ పర్యటనకు సీబీఐ కోర్టు అనుమతి - దిల్లీకి సీఎం జగన్

CM Jagan Delhi tour: యూరప్‌కు వెళ్లేందుకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి హైదరాబాద్ సీబీఐ కోర్టు నుంచి అనుమతి లభించింది. రాష్ట్ర విభజన అంశాలపై ఉన్నతస్థాయిలో మాట్లాడేందుకు ముఖ్యమంత్రి దిల్లీ వెళ్తారని తెలుస్తోది. ఇదే అంశాన్ని నిన్న సీఎస్ జవహర్ రెడ్డి తెలిపారు. దిల్లీ పర్యటన కోసం యూరప్ పర్యటన రద్దు చేసుకున్నట్లు సీఎస్ వెల్లడిచారు.

CM Jagan Delhi tour
సీఎం జగన్

By

Published : Apr 19, 2023, 10:36 PM IST

Jagan Europe trip: ఈ నెల 10వ తేదీన యూరప్ వెళ్లేందుకు అనుమతి కోరిన సీఎం జగన్​కు హైదరాబాద్ సీబీఐ కోర్టు నుంచి ఎట్టకేలకు నేడు అనుమతి లభించిది. అయితే, సీఎం జగన్ మాత్రం విభజన అంశాలు, రాష్ట్ర అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వ పెద్దలతో చర్చల నేపథ్యంలో యూరప్‌నను రద్ధు చేసుకున్నారు. ఈ విషయాన్ని నిన్న సీఎస్ జవహర్ రెడ్డి స్వయంగా వెల్లడించారు.

యూరప్ పర్యటన అనుమతి: యూరప్‌కు వెళ్లేందుకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ సీబీఐ కోర్టు నుంచి అనుమతి తీసుకున్నారు. కుటుంబసభ్యులతో కలిసి యూరప్ పర్యటన వెళ్లేందుకు అనుమతివ్వాలని కోరుతూ ఈ నెల 10న జగన్ సీబీఐ కోర్టులో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్‌లో అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదన్న బెయిల్ షరతులను సడలించి అనుమతించాలని కోరారు. జగన్‌ పిటిషన్​పై ఈ నెల 17న సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. పిటిషన్​పై నిన్న వాదనలు ముగిశాయి. ఈ నెల 21నుంచి 29 తేదీ వరకు యూరప్​ వెళ్లేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సీబీఐ అనుమతించింది. వెళ్లే ముందు మొబైల్‌ ఫోన్, ఈ- మెయిల్ ఐడీ, పర్యటన వివరాలు కోర్టుకు, సీబీఐకి ఇవ్వాలని జగన్‌ను ఆదేశించింది.

సీఎం జగన్ దిల్లీ పర్యటన వివరాలు తెలిపిన సీఎస్ జవహర్‌రెడ్డి: మంత్రి వివేకా హత్య కేసులో సీబీఐ వేగం పెంచిన నేపథ్యంలో సీఎం జగన్ మళ్లీ దిల్లీ బాట పడుతారని ప్రతిపక్షాలు ఆరోపించాయి. సీఎం జగన్‌ ముందుగా అనుకున్న విదేశీ పర్యటన రద్దు చేసుకున్నారు. మళ్లీ దిల్లీ బాటపడతారని ఇప్పటికే ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి నిన్న మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర విభజన అంశాలపై ఉన్నతస్థాయిలో మాట్లాడేందుకు గత నెలలో ముఖ్యమంత్రి దిల్లీ వెళ్లారని సీఎస్ తెలిపారు. ఇదే అంశపై మరోమారు జగన్ దిల్లీకి వెళ్లనున్నట్టు జవహర్ రెడ్డి వెల్లడించారు. రెండు రోజుల్లో ముఖ్యమంత్రి జగన్ దిల్లీకి వెళ్తారని స్పష్టం చేశారు. దీని కోసం ఆయన తన వ్యక్తిగత పర్యటనను కూడా వాయిదా వేసుకున్నట్లు వెల్లడించారు. పర్యటన కోసం సీఎం జగన్ ఈ నెల 10న సీబీఐ కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్​ వాదనలు విన్న కోర్టు నేడు సీఎం విదేశి పర్యటనకు అనుమతించింది. అయితే రాష్ట్రంలో జరుగుతున్న పరిమాణాల దృష్యా సీఎం విదేశీ పర్యటనకు వెళ్తారా.. లేదా.. అనేది సందిగ్దంగా మారింది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details