సత్తెనపల్లి కి చెందిన శ్రీనివాసరావు నరసరావుపేట లో నిర్వహించిన ఖేల్ ఇండియా కబడ్డీ టౌర్నమెంట్ కి కోడెల శివరాం ఆదేశాలు మేరకు ఆహారాన్ని సరఫరా చేశారు. దాని నిమిత్తం 20 లక్షల రావాల్సి ఉండగా, కోడెల శివరాం తనని బెదిరించి విడతల వారీగా 11 లక్షలు తీసుకున్నారని శ్రీనివాసరావు పేర్కొన్నారు. తనకు రావాల్సిన నగదు కోసం గుంటూరు చుట్టూగుంట గౌతమి హీరో హోండా షోరూం వద్ద బైఠాయించి తన నగదు కోసం నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. తనకు రావాల్సిన నగదు ఇస్తేనే ఇక్కడ నుండి వెళతానని బాధితుడు అక్కడే కూర్చున్నాడు. కొంత సమయం తరువాత షాప్ వారు పోలీసులకు పిర్యాదు చేయగా అతన్ని నగరంపాలెం పోలీస్ స్టేషన్ వద్దకు తీసుకువెళ్లారు. తాను ఇచ్చిన ఫిర్యాదు మేరకు నగరంపాలెం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. తనకు రావాల్సిన నగదు వచ్చేవరకు తాను నిరసన చేస్తూనే ఉంటానని బాధితుడు పేర్కొన్నారు. అవసరమైతే ముఖ్యమంత్రి వైఎస్. జగన్ ను , మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ని కలసి కోడెల శివరాం చేసిన అక్రమాలను వివరిస్తామని శ్రీనివాసరావు వెల్లడించారు.
నా డబ్బు నాకు ఇవ్వకపోతే... నీ గుట్టు బయటపెడతా.... - 20 లక్షల కేసు
కోడెల శివరాం దగ్గర నుంచి 20 లక్షలు కాటరింగ్ నిర్వాహకుడు శ్రీనివాసరావుకు రావల్సి ఉంది. అయితే తనను బెదిరించి 11 లక్షలు తీసుకున్నారంటూ శ్రీనివాసరావు గుంటూరులో శివరాంకు చెందిన షోరూం ఎదుటు నిరసన వ్యక్తం చేశారు. తనకు న్యాయం జరగకపోతే శివరాం అక్రమాలను బయటపెట్టి పార్టీ నుండి సస్పెండ్ చేయిస్తానని శ్రీనివాసరావు అంటున్నారు.
నిరసన వ్యక్తం చేస్తున్న శ్రీనివాసరావు