గుంటూరు జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 1,285కు చేరింది. నిన్న జిల్లాలో గరిష్ఠస్థాయిలో 92 కేసులు నమోదయ్యాయి. కొత్త కేసుల్లో 44 గుంటూరు నగరంలోనే బయటపడ్డాయి. మంగళగిరిలో 8, తాడేపల్లిలో 6, తెనాలి 7, దాచేపల్లి 4, చిలువూరులో 3 కేసులు చొప్పున నమోదయ్యాయి. సత్తెనపల్లి, ఫిరంగిపురం, మాచర్ల, చినమద్దిపూడిలో 2 చొప్పున, నంబూరు, గామాలపాడు, రేవేంద్రపాడు, కంభంపాడు, నాగులవరం, కొర్రపాడు, దుగ్గిరాల, పెదవడ్లపూడి, నర్సరావుపేట, వడ్డేశ్వరం, ఉండవల్లిలో ఒక్కో కేసు చొప్పున నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
1285కు చేరిన కరోనా కేసుల సంఖ్య
గుంటూరు జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తి ఆందోళన కల్గిస్తోంది. నిన్న జిల్లాలో గరిష్ఠస్థాయిలో 92 కేసులు నమోదయ్యాయి. జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 1,285కు పెరిగింది.
గుంటూరు జిల్లాలో 1285 కు చేరిన కరోనా కేసుల సంఖ్య
గుంటూరు క్వారంటెన్ కేంద్రంలో 8 మందికి పాజిటివ్ గా నిర్ధారణ జరిగింది. తాజా కేసులతో కలిపి గుంటూరు నగరంలో కేసు సంఖ్య 489కు చేరుకుంది. నరసరావుపేటలో 228, తాడేపల్లిలో 156, తెనాలిలో 64, మంగళగిరిలో 58, దాచేపల్లి 24, దుగ్గిరాలలో 23 కు చేరినట్లు గణాంకాలు చెబుతున్నాయి.
ఇది చదవండిరాష్ట్రంలో రికార్డు స్థాయిలో 796 కరోనా కేసులు.. 11 మంది మృతి