గుంటూరులో డొంక రోడ్డు నుండి బస్ స్టాండ్ వైపు వెళ్తున్న కారు మూడు వంతెనలు వద్ద టైర్ పేలటంతో డివైడర్ ను ఢీకొట్టింది. కారులో ఉన్న వ్యక్తి వాహనాన్ని అదుపు చేసే క్రమంలో ఒక్కసారిగా బ్రేకులు వేయగా.. కారు అద్ధాన్ని బలంగా కొట్టుకున్నాడు. ఆ వ్యక్తి తలకు బలమైన గాయాలు అయ్యాయి. క్షతగాత్రుడుని వెంటనే స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిత్యం రద్దీగా ఉండే మార్గంలో సమయానికి ఎలాంటి వాహనాలు రాకపోవటంతో పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. సీట్ బెల్ట్ ధరించకపోవడం వల్లే తలకు బలమైన గాయాలయ్యాయని పేర్కొన్నారు.
పేలిన కారు టైరు... డ్రైవర్ తలకు గాయాలు
గుంటూరు మూడు వంతెనలు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కారు టైరు పేలటంతో డివైడర్ను ఢీకొట్టింది. డ్రైవర్ తలకు తీవ్రగాయాలయ్యాయి.
పేలిన కారు టైరు