ముఖ్యమంత్రి నివాసం వద్ద కారు బోల్తా - amaravati
గుంటూరు జిల్లా అమరావతి నుంచి ఉండవల్లి వెళ్తున్న కారు.. ప్రమాదానికి గురైంది. ముగ్గురికి గాయాలయ్యాయి. కాసేపు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది.
ముఖ్యమంత్రి నివాసం వద్ద కారు బోల్తా
గుంటూరు జిల్లా ఉండవల్లిలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం వద్ద కారు బోల్తా కొట్టింది. అమరావతి నుంచి ఉండవల్లి వైపు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి పొలాల్లోకి దుసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి. కొద్ది సేపు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.
Last Updated : May 16, 2019, 6:07 PM IST